Saturday, May 18, 2024

రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రిక్‌ లైన్‌ ఇన్స్పెక్టర్‌

తప్పక చదవండి

సికింద్రాబాద్‌ : ఓ వ్యక్తి ఇంటికి ఉన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ను కమర్షియల్‌ నుంచి డొమెస్టిక్‌ కు మార్చేందుకు రూ.6వేలు లంచం తీసుకున్న ఎలక్ట్రిక్‌ లైన్‌ ఇన్స్పెక్టర్ను ఏబీసీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టున్నారు. అతని వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ. 6వేలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. తార్నాకలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లాలాగూడలోని టీఎస్‌ఎస్పీ డీసీఎల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయ పరిధిలో జీ. వెంకటేశ్వర్లు లైన్‌ ఇన్స్పెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇదే ప్రాంతంలో నివాసముండే మహ్మద్‌ షాహిద్‌ అలీ తన ఇంటికి ఇంతకు ముందు అమర్చిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్‌ ను కమర్షియల్‌ కెటగిరీ నుంచి డొమెస్టిక్‌ కెటగిరీగా మార్చాలని అప్లికేషన్‌ పెట్టుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును కొంత కాలంగా లైన్‌ ఇన్స్పెక్టర్‌ పెండిరగులో పెట్టాడు. దీనిపై బాధితుడు లైన్‌ ఇన్‌ స్పెక్టర్‌ వెంకటేశ్వర్లును కలువగా డొమెస్టిక్‌ కేటగిరికి మార్చేందుకు రూ. 6వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధకారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వారు అందజేసిన నోట్లను బాధితుడు బుధవారం లాలాగూడ లోని ఎలక్ట్రిసిటీ ఇంజనీర్‌ కార్యాలయంలో లైన్‌ ఇన్స్పెక్టర్‌ కి అందజేస్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ.6వేలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు లైన్‌ ఇన్స్పెక్టర్‌ వెంకటేశ్వర్లును అరెస్టు చేసి ఏసీబీ అడిషనల్‌ స్పెషల్‌ జడ్జీ ముందు ప్రవేశపెట్టగా న్యాయమూర్తి అతనికి రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు