Tuesday, June 25, 2024

కేసీఆర్ ది డ్రంక్ అండ్ డ్రైవ్ సర్కార్..

తప్పక చదవండి
  • తెలంగాణకు ముందు బిచ్చమెత్తుకునే స్థాయి కేసీఆర్ ది..
  • ఇప్పుడు వేల కోట్లు ఆస్తులు ఎట్లా వచ్చాయ్..?
  • తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలున్నాయా?
    -1400 మంది పేదలు చస్తే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారు
  • బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలది ఫెవికాల్ బంధం..
  • మక్తల్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలేమైనయ్ కేసీఆర్..
  • ఆత్మకూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన బండి సంజయ్..
  • భారీ ఎత్తున హాజరైన జన సందోహం..
  • అడుగడుగునా జై మోదీ.. జై బండి సంజయ్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం..

( కాంగ్రెస్ పార్టీ ఓ కిరాణా దుకాణం.. గెలిచినోళ్ళంతా పోయేది బీఆర్ఎస్ లోకే.. హైదరాబాద్ లో ఇస్లామిక్ సెంటర్ పెడతామంటే ఖబడ్దార్..హిందువులను కించపరిస్తే బట్టలూడదీసి ఉరికించి కొడతాం.. ఒవైసీకి దమ్ముంటే…. తెలంగాణ అంతటా పోటీ చేయాలి : బండి సంజయ్.. )

హైదరాబాద్, 29 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బిచ్చమొత్తుకున్న కేసీఆర్ కుటుంబం నేడు వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎట్లా కూడగట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలది ఫినాయిల్ బంధమని, కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం వంటిదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా పోయేది బీఆర్ఎస్ లోకేనని అన్నారు. హైదరాబాద్ లో ఇస్లామిక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించిన బండి సంజయ్ కుమార్ హిందువులను కించపరిస్తే బట్టలూడదీసి ఉరికిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం ఆత్మకూర్ లో జరిగిన మక్తల్ నియోజకవర్గ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు. ఈ సభకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, రాష్ట్ర నాయకులు నాగూరావు నామోజీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప, నారాయణపేట, వనపర్తి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రాజవర్దన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జలంధర్ రెడ్డి, కొండయ్య, బోసుపల్లి ప్రతాప్, రతన్ పాండురంగారెడ్డి, సుభాష్ చందర్ జీ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు హాజరైన ఈ బహిరంగ సభలో మోదీ జిందాబాద్, బండి సంజయ్ జిందాబాద్, జై బీజేపీ, జై శ్రీరాం అంటూ యువత అడుగడుగునా చేసిన నినాదాలతో సభా ప్రాంగణమంతా పెద్ద ఎత్తున జోష్ నెలకొంది. బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

ఆత్మకూరులో సభ పెడుతున్నారంటేనే నాకు ఆత్మ విశ్వాసం వస్తోంది. కేసీఆర్ చేయించుకున్న ఏ సర్వేలోనైనా గెలిచేది బీజేపీయేననే నివేదికలొస్తున్నాయి. మరో 5 నెలలు సమయం నాకివ్వండి. కేసీఆర్ ను గద్దె దించే బాధ్యత నాది. కేసీఆర్ ప్రజలకోసం చేస్తుందేమీ లేదు. ఎంతసేపు ప్రజలను ఎట్లా మోసం చేయాలి? పక్క పార్టీలను ఎట్లా దెబ్బతీయాలనే ఆలోచన తప్ప మరోకొటి లేదు. నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, చేసిన అభివ్రుద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రిపడుకునే వరకు ప్రజలకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించిన ఘనత మోదీదే. ఈ దేశంలో 12 కోట్ల మందికి టాయిలెట్లు, 10 కోట్ల మంది ఉచిత గ్యాస్ కనెక్షన్లు, 80 కోట్ల మందికి 3 ఏళ్లుగా ఉచిత బియ్యంతోపాటు 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించిన ఘనత మోదీదే. వీటితోపాటు గ్రామాల్లోని స్మశాన వాటికలకు, లైట్లకు, రోడ్లకు, ప్రక్రుతి వనాలు, రైతు వేదికలుసహా పంచాయతీలకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించిన వ్యక్తి మోదీ. ప్రపంచ దేశాలన్నీ ‘మోదీ ది బాస్’ అంటూ పాదాభివందన చేసే పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ నుండి దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతోపాటు 50 దేశాల ప్రజలను రక్షించిన మహానుభావుడు మోదీ. యూరియా సబ్సిడీ, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఒక్కో ఎకరానికి రూ.30 వేలు సాయం చేస్తున్న మహానేత మోదీ. అందుకే ప్రతి ఒక్కరూ 9090902024 నెంబర్ కు డయల్ చేసి బీజేపీకి మద్దతు పలకాలని కోరుతున్నా.

తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే వాటిని కట్టించకుండా ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి, అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని ఇస్తానని, రుణమాఫీ అమలు చేస్తానని మోసం చేసిన ద్రోహి కేసీఆర్. కరోనాతో జనం చస్తుంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ చాలంటూ మోసం చేసిన పారాసిటమాల్ డాక్టర్, కాళేశ్వరం ఇంజనీర్ కేసీఆర్. వర్షాలతో పంట నష్టపోయి రైతులు అల్లాడుతున్నా నయాపైసా సాయం చేయని దుర్మార్గుడు. ఫ్రీ యూరియా, విత్తనాలిస్తానని హామీలిచ్చి మోసం చేసిన ద్రోహి. అవినీతిమయమైన సర్కార్ కేసీఆర్ దే. కారు-సారు-60 పర్సంట్ సర్కార్ కేసీఆర్ దే.
ఆత్మకూరులో డిగ్రీ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి, బస్ డిపో హామీలేమైనయ్. ఏ ఒక్క హామీ అమలు చేయని కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించిండు. ఉన్న భూములన్నీ అమ్ముకుని ప్రజల చేతికి చిప్ప ఇచ్చిండు. మనల్ని ముంచి మహారాష్ట్రకు పోయి ఊరేగుతున్నడు. ముఖ్యమంత్రిగా ఉంటూ 9 ఏళ్లుగా ఏం సాధించినవ్? 5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినవని అడుగుతుంటే నోరుమెదపడం లేదు. పొరపాటున మళ్లీ కేసీఆర్ సీఎం అయితే మరో 5 లక్షల కోట్ల అప్పు చేస్తడు. ఒక్కో తలపై రెండున్నర లక్షల అప్పు చేస్తడు.. తెలంగాణ అభివ్రుద్ధి కోసం కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే సహకరించకుండా ప్రజలకు నష్టం చేస్తున్న మోసగాడు కేసీఆర్. పండించిన ప్రతి గింజా నేనే కొంటున్నా అని చెబుతూ కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా రైతులను మోసం చేసిన దుర్మార్గుడు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి పైసా కేంద్రమే ఇస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందల్లా బ్రోకరిజమే.

ఒకనాడు తినడానికి తిండేలేని కేసీఆర్ కు వేల కోట్లు ఎలా వచ్చాయి? ఆత్మకూరుసహా తెలంగాణలోని పేదలంతా పేదలుగానే మారితే బిచ్చమెత్తకునే కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఎట్లా సంపాదించింది? విదేశాల్లో పెట్టుబడులు ఎట్లా పెట్టే స్థాయికి వచ్చారు? ఒకనాడు డబ్బులు కట్టలేదని ప్రచార రథాన్ని ఫైనాన్స్ వాళ్లు గుంజుకుపోతుంటూ చూస్తూ ఊరుకుండిపోయిన చరిత్ర కేసీఆర్ దే. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు సుష్మాస్వరాజ్ మద్దతివ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యేవాడా? యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ వస్తుందని ధైర్యం నింపుతూ సుష్మాస్వరాజ్ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన విషయం తెల్వదా? తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేంది? తెలంగాణ కోసం శ్రీకాంత్, ఇషాంత్ రెడ్డి, సుమన్, కిష్టయ్య వంటి పేదలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారు. నిజాం రాజ్యంలో రజాకార్ల రూపంలో రాష్ట్రాన్ని దోచుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ దే. అందుకే అధికార మదమెక్కి 600 కార్లతో మహారాష్ట్ర కు పోయి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నరు. ‌కేసీఆర్ ది డ్రంక్ అండ్ డ్రైవ్ సర్కార్. మందు తాగి బండి నడిపితే కేసు పెడుతున్న పోలీసులు… మందు తాగి రాష్ట్రాన్ని పాలిస్తే ఎందుకు కేసు పెట్టడం లేదు? కేసీఆర్ దుర్మార్గపు పాలనలో ప్రజలతోపాటు సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అరాచకాలకు అంతే లేకుండా పోయింది. మహిళలపై వేధింపుల విషయంలో ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో తీరు… ఒక ఎమ్మెల్యే ఆడోళ్ల చేతులు పట్టుకుంటడు.. ఇంకోడు నోట్ల చేతులు పెడతడు. ఇంకో ఎమ్మెల్యేను చూసి సొంత బిడ్డే అసహ్యించుకుంటోంది. అందుకే బీఆర్ఎస్ పై కొట్లాడి గెలుస్తోందే బీజేపీ. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చాయా? మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు కాలేదా? టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలిచిన మాట వాస్తవం కాదా? కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ జీరో. ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని నివేదికలు వస్తున్నందునే బీజేపీని దెబ్బతీసి కాంగ్రెస్ ను లేపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలది ఫినాయిల్ బంధం. కాంగ్రెస్ పార్టీ ఓ కిరాణా దుకాణం. ఎందుకంటే కాంగ్రెస్ లో గెలిచినోళ్లంతా టీఆర్ఎస్ లోకి వెళతారు. ఫినాయిల్ తో సాఫ్ చేసినట్లుగా అంతా కట్టకట్టుకుని బీఆర్ఎస్ లోకి పోతారు. హైదరాబాద్ లో ఇస్లామిక్ సెంటర్ పెట్టాలని చూస్తున్నరు. ఒఫ్పుకుందామా? సిగ్గుండాలే… పాతబస్తీలో యువకులకు ఉద్యోగాలెందుకు ఇవ్వడం లేదని నిలదీస్తుంటే పట్టించుకోని ఒవైసీకి సిగ్గు లేదు. బీజేపీ కార్యకర్తలు ఛత్రపతి శివాజీ వారసులు. పాతబస్తీ మాదని విర్రవీగిన ఒవైసీ సోదరులను సవాల్ చేసి పాతబస్తీ కాషాయ అడ్డా అని నిరూపించిన ఘనత బీజేపీది. 15 నిమిషాలు టైమిస్తే నరికి చంపుతామని మజ్లిస్ అంటే ఊరుకుందామా? సరస్వతి అమ్మవారిని నగ్నంగా చిత్రీకరిస్తున్నా, అయ్యప్ప స్వామిని, దుర్గామాతను కించపరుస్తుంటే ఊరుకుందామా? బట్టలూడదీసి ఉరికించి కొట్లాడాలా? వద్దా? నేను హిందుత్వం గురించి మాట్లాడాలా? వద్దా.. బీహార్ లో అధికారంలోకి లేని ఎంఐఎంకు 5 సీట్లు ఎట్లా వచ్చాయో ఆలోచించండి. అక్కడ 12 శాతం ఓట్లున్న వర్గానికి 5 సీట్లు వస్తే… తెలంగాణలో 80 శాతం ఓట్లున్న మనకు ఎన్ని సీట్లు రావాలో ఆలోచించండి. మజ్లిస్ పార్టీకి హైదరఒవైసీ… నీకు దమ్ముంటే. నువ్వు మొగోడివైతే.. నువ్వు నిజంగా అల్లా భక్తుడివైతే, ఖురాన్ ను పవిత్ర గ్రంథంగా భావిస్తే మక్తల్ సహా తెలంగాణ అంతటా పోటీ చేయాలి. అప్పుడు బీజేపీ దమ్మేందో చూపిస్తాం. కాషాయ జెండా నుండి వచ్చే భగభగలకు పచ్చ జెండా మాడిమసై పోతది. అందుకే రామరాజ్యం రావాలి. మోదీ రాజ్యం రావాలి. అందుకే కమలం పువ్వు గుర్తు మీద ఎవరు నిలబడ్డా గెలిచే పరిస్థితి రావాలి. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత విద్య, వైద్యంతోపాటు నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం. రైతులకు ఫసల్ బీమాను అమలు చేస్తాం. ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు