- ఈతలు కొడుతున్న వంగపల్లి గ్రామస్తులు…
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద వర్షానికి నీరు చేరి చెరువును ఓ వైపు స్విమ్మింగ్ ఫుల్ ను తలపిస్తుందని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య అన్నారు.
దీనిని చుస్తే చాలు కేసీఆర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పరిపాలన తీరు కనిపిస్తుందని అన్నారు. ఇలా నిర్మాణం చేసిన ఇంట్లో మీరు ఉంటారా అని ప్రశ్నించారు.