Saturday, July 27, 2024

ప్రజల సమస్యలపై స్పందించరా?

తప్పక చదవండి
  • ప్రజల గొంతెండుతున్నా పట్టించుకోని
    పాలనాయంత్రాంగం..
  • మౌలిక వసతుల కల్పనలో
    చర్యలు చేపట్టాలని మున్సిపల్‌
    కార్యాలయం ముట్టడిరచిన సీపీఐ
  • సీపీఐ జిల్లాకార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా

పాల్వంచ : సమస్యలతో ప్రజల సతమతమవుతుంటే కనీసం అధికారులు స్పందించరాని సిపిఐ జిల్లాకార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా ప్రశ్నించారు. పట్టణంలోని మంచినీటి శాశ్వత పరిష్కారం చూపించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక చండ్రరాజేశ్వరరావుభవనం నుండి బుధవారం ప్రదర్శన చేసిన మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిరచారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్‌1 మున్సిపాల్టీగా ఉన్న పాల్వంచ మున్సిపాల్టీ పరిధిలోఉన్న వార్డుల్లో కనీస అవసరాలు కూడా కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తి విఫలమైందన్నారు. తక్షణమే పాల్వంచ మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించి పాలకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టణానికి నలుదిక్కుల నీటివనరులు పుష్కలంగా ఉంటే రోజు తాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందని

విమర్శించారు. పాల్వంచ మున్సిపాల్టీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజల కనీస మౌలిక వసతులైన తాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, ఇంటినెంబర్లు తదితర సమస్యలపై వెంటనే అధికారులు స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మున్సిపల్‌ కార్యాలయానికి తాళం వేసుకోవాలని ప్రజా ఆందోళనపై స్పందించకుంటే ఉద్యమ సత్తా చవి చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్‌ అధికారులకు అందచేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు విశ్వనాధం, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, ఉప్పుశెట్టి రాహుల్‌, పద్మజ, సుధాకర్‌, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, రమేష్‌, పద్మ, లక్ష్మీ, సంఘమిత్ర, ఈశ్వరమ్మ, కృష్ణవేణి, బిక్కులాల్‌, నాగేశ్వరరావు, సత్యనారాయణ, రవి, లక్ష్మీ, కిరణ్‌,బాలు,రమేష్‌, రాజు, జ్యోతి, వెంకటేశ్వర్లు పాల్గన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు