Saturday, July 27, 2024

బండాపోతుగల్‌ పాలకవర్గం నిర్లక్ష్యం..

తప్పక చదవండి
  • కాలనీవాసులపైనే భారం వేస్తూ కాలయాపన..
  • డ్రైనేజీలు లేకుండా రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌…
  • వానపడితే చెరువును తలపిస్తున్న కాలనీ సీసీ రోడ్డు
  • మురుగునీరుతో దుర్వాసన వెదజలుతున్న కాలనీ ..
  • ఆదాబ్‌ కథనానికి స్పందించి వివరణతోనే
    సరిపెట్టిన పంచాయతీ పాలకవర్గం..

చిలిపిచేడ్‌ : పల్లె ప్రగతితో పల్లెలన్నీ పట్టణాలను తలపిస్తున్నా యంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రచార హోరు సాగిస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పాలకవ ర్గాలు నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలను బద్నాం చేస్తున్నాయి.సమస్యలను పరిష్కరించమంటే స్పందించకుండా సమస్య లను మరింత జఠిలం చేస్తూ సవాలు ప్రతిసవాలుతో కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు ప్రజాప్రతి నిధులు. దానికి నిదర్శనమే చిలిపిచేడ్‌ మండలం బండాపోతుగల్‌ గ్రామంలోని రెండవ వీధి పరిస్థితి.ఈ ఏడాది మర్చి నెలలో ఆదాబ్‌ హైదరాబ్‌ ప్రతినిధిని గ్రామంలోని రెండవ వీధి ప్రజలు సంప్రదించి సమస్యను వివరించగా ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘‘వర్షం పడిరదా రాకపోకలకు అంతరాయమే’’అనే శీర్షికన కథనం ప్రచురించింది.దానికి మరునాడు గ్రామ పాలకవర్గం ఉపసర్పంచ్‌ స్పందించి సమస్యను పరిష్కరిస్తామని వివరణ కూడా ఇవ్వడం జరిగింది.కానీ వర్షాకాలం సమీపిస్తున్నా ఇప్పటికి ఆ సమస్యను పరిష్కరించలేదు.అంతే కాకుండా నిర్లక్ష్యంగా గ్రామ ఉపసర్పంచ్‌ పాలక వర్గం సిబ్బంది సమాధానాలు ఇస్తున్నారు.గతంలో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయకుండా కాలనీలో సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌ దర్జాగా బిల్లు ఎత్తుకుని పోయాడు.అప్పటి నుంచి డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా నీరు మొత్తం రోడ్డుపైనే నిలిచిపోతుంది.దీంతో కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగు తుంది.ఆదాబ్‌ ప్రతినిధి ఉపసర్పంచ్‌ ని వివరణ కోరగా కాలనీ ప్రజలు డ్రైనేజీ కాలువకు స్థలం ఇవ్వడం లేదని,అది అలాగే ఉంటుందని సమాధానం చెప్పడం విడ్డూరంగా మారింది.ఈ విషయంపై ఉన్నతాధికా రులు స్పందించి వెంటనే డ్రైనేజి కాలువ ఏర్పాటు చేసి నీరు నిల్వలేకుండా చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.చిన్నపాటి వర్షానికే నీరు నిలువ ఉండటం వలన దోమలు ఆవాసం చేసి అనేక రోగాల బారినపడే అవకాశాలున్నాయని,వీధి మొత్తం చిత్తచిత్తడిగా రొంపిగా మారిందని,తమ సమస్యను వెంటనే మండల స్థాయి అధికారులు స్పందించాలని కోరుతున్నారు.మరి మండల స్థాయి అధికారులు ఏ మేరకు ఈ సమస్యపై స్పందిస్తారో వేచి చూడాల్సిందే..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు