Sunday, September 15, 2024
spot_img

ఛలో హైదరాబాద్‌ సభను విజయవంతం చేయండి

తప్పక చదవండి

చేవెళ్ల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంద కృష్ణమాదిగ పిలుపు

శంకర్‌ పల్లి : బుధవారం రోజు జరిగిన చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మా ర్పీఎస్‌ ముఖ్య నాయకుల సమావేశం శంకర్‌ పల్లి మండల కేంద్రంలోని గార్డెన్‌ ఫంక్షనల్‌ లో చేవెళ్ల నియోజ వర్గ నాయకులు శంకర్‌ పల్లి మండల ఇంచార్జి కాడిగల్ల ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న శ్రీ మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ జులై నెలలో జరిగే ఛలో హైదరాబాద్‌ సభను విజయవంతం చేయాలని ఈ సభ ద్వారా రాష్ట్రానికి కేంద్రానికి దిమ్మ తిరగాలని మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు,ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి మాదిగ బిడ్డలు రావాలని పిలుపనిచ్చారు, ఎస్సీ వర్గీకరణ విషయం లో రాష్ట్రం లో బి ఆర్‌ ఎస్‌ పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలూ విఫలమ య్యాయని అన్నారు,అధికారంలో కి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి దళితులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు,ఇప్పటికైనా ఎస్‌ సి వర్గీకరణ జరపకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ది చెబుతామని అన్నారు,వృద్దులు, వితంతువులు,వికలాంగులకు పించన్లు పెంచిన ఘనత ఎమ్మార్పీఎస్‌దాని గుర్తు చేశారు.అలాగే అనాధ పిల్లల సంరక్షణ చూసుకుంటానని చెప్పి అనాదలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ చేవెళ్ల నియోజకవర్గ నాయకులు ప్రవీణ్‌ కుమార్‌ మాదిగ, రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ నరసింహ కో కన్వీనర్‌ కృష్ణ ఎంఎస్పి రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ బాబు శంకర్‌ పల్లి మండల ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌ మాదిగ, యం ఎస్‌ పి నాయకులు వంశీ,మనోజ్‌,శ్రీకాంత్‌, సీనియర్‌ నాయకులు లక్ష్మయ్య, పెంటయ్య,రాంచందర్‌, శ్రీనివాస్‌, జనార్ధన్‌,గణేష్‌,సతీష్‌ చేవెళ్ల నియోజక వర్గం నాయకులు తదితరలు పాల్గోన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు