- పూల మాలలతో గద్దర్ చిత్రపటానికి జోహార్లరించిన డీ.డబ్ల్యు.జె.ఎస్. సభ్యులు..
- చేర్యాల మండల కేంద్రంలో కార్యక్రమ నిర్వహణ..
- గద్దర్ మరణవార్త తీవ్ర విషాదం నింపిందన్న వక్తలు..
సిద్దిపేట జిల్లా, చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల విచారణ వ్యక్తం చేసి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చేర్యాల, డిడబ్ల్యూజేఎస్ సభ్యులు.. కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట నాలుగు మండలాల అధ్యక్షులు వెంకీ కనకయ్య, కర్రోల్ల నవజీవన్, జీడికంటి సుధాకర్, తాడేం యాదగిరితో కలిసి గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ…. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ.. ప్రజల్లో స్పూర్తిని రగిలించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇక లేరు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ‘ప్రజా యుద్ధ నౌక’ గద్దరన్న కి లాల్ సలాం.. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటలు, పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు బిడబ్ల్యుజెఎస్ చేర్యాల తరఫున గద్దర్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాం అన్నారు..