Saturday, July 27, 2024

సిపిఐ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయండి

తప్పక చదవండి

-రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ కు సిపిఐ నేతల వినతి పత్రం

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుంట్లూర్ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు సుమారు 100 ఎకరాల భూదాన భూమిలో 10 వేల మంది నిరుపేద కుటుంబాల ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారని, అట్టి గుడిసెలను తొలిగించేందుకు స్థానిక రెవిన్యూ అధికారులు ప్రైవేట్ భూకబ్జాదారులతో కుమ్మకై గుడిసెలను తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకొని గుడిసెవాసులకు అండగా నిలుస్తున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యది రెడ్డి, పానుగంటి పర్వతాలు, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పామిడి శేఖర్ రెడ్డి, సిపిఐ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, మాజీ కౌన్సెలర్ హరి సింగ్ నాయక్ తోసహా 21 మంది సిపిఐ నేతలు కార్యకర్తలపై హయత్ నగర్ పోలీసులు అక్రమ కేసులు బనాయించారని, సిపిఐ నేతలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఈ.టి. నరసింహ, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యది రెడ్డి, పానుగంటి పర్వతాలు తదితరులు బుధవారం హైదరాబాద్ డిజిపి కార్యాలయంలో రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఆచార్య వినోబా భవే భూదాన భూములను పేదలకు పంపిణి చేయడానికి సేకరించాడని, ఆ భూములు పేదలకే చెందుతాయి కాబట్టి ఆరునెలల క్రితం కొన్ని వేల ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీల ప్రజలు అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, ప్రైవేట్ భూములు అసలే కావని, కొంతమంది భూబకాసురుల నకిలీ భూమి పత్రాలను సృష్టించి, రెవిన్యూ మరియు పోలీసుల అండతో గుడిసెలను తొలిగించే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులు భూకబ్జాదారులపై కేసులు పెట్టకుండా గుడిసెల కూల్చివేతలను అడ్డుకొని పేదల పక్షాన నిలిచినా సిపిఐ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని సిపిఐ నేతలు డిజిపి అంజనీ కుమార్ కు వివరించారు. భూదాన భూమిపై పూర్వాపరాలు పరిశీలించి ప్రస్తుతం నివాసముంటున్న 10 వేల కుటుంబాల ప్రజల గుడిసెలు తొలగించకుండా మరియు అక్రమ కేసులు బనాయించకుండా ఆదేశించి, పేదలకు న్యాయం చేయాలనీ వారు కోరారు. అనంతరం చాడ వెంకట్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ పేదల కోసం ఉద్దేశించిన భూదాన భూములలో పేదలు గుడిసెలు వేసుకుంటే తప్పేమిటని, వందల ఎకరాల భూదాన భూములు బడా కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉంటె రెవిన్యూ అధికారులు పట్టించుకోరని అన్నారు. కుంట్లూర్ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు సుమారు 100 ఎకరాల భూదాన భూమిలో గుడిసెలు వేసుకున్న ప్రజలకు వెంటనే పట్టాలిచ్చి, భూకబ్జాదారులపై కఠిన చెర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేసారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు