Sunday, September 15, 2024
spot_img

చందర్లపాడు మండల రెవిన్యూ కార్యాలయం పై ఏసీబీ దాడులు

తప్పక చదవండి

-వి ఆర్ ఓ వడ్లముడి వెంకట నరసింహ రావు ఫై బాధితుడి ఫిర్యాదు
-బాధితుడి నుంచి లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అధికారి

హైదరాబాద్: ఎన్టీఆర్ జిల్లా కరెన్సీ నగర్, విజయవాడ కు చెందిన బాధితుడు పాపోలు శ్రీనివాస్ కు చెందిన 8 సెంట్ల (RS. No. 267/1) ఖాళీ స్థలమునకు సంబంధించి స్వాధీన పత్రం కొరకు దరకాస్తును ప్రాసెస్ చేయుటకుగాను 13,000/- రూపాయలను లంచంగాఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండల రెవిన్యూ కార్యాలయం, చందర్లపాడు గ్రామ వి ఆర్ ఓ వడ్లముడి వెంకట నరసింహ రావు @ వాసు బాధితుడిని డిమాండ్ చేసి, ముందుగా రూ. 4000/- లంచముగా ఇవ్వమని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసిబి 14400 కాల్ సెంటర్, ఏసిబి యాప్ ద్వారా అవినీతి అధికారిపై పిర్యాదుచేశాడు . దీనిపైన కేసు నమోదు చేసుకున్న అధికారులు బుధవారం ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలo, చందర్లపాడు గ్రామ విఆర్ఓ వడ్లముడి వెంకట నరసింహ రావు బాధితుడి వద్ద నుండి 4,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు