Sunday, April 28, 2024

శ్రీనివాస్ గౌడ్ ‘ఆఫిడవిట్ కేసు’లో పోలీసులపై కోర్టు ఆగ్రహం..

తప్పక చదవండి
  • న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా..?
  • అఫిడవిట్‌ టాంపరింగ్‌పై కేసు నమోదు చేశారా.. ? లేదా.. ?

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ను ఎన్నికల అఫిడవిట్‌ కేసు వెంటాడుతోంది. అఫిడవిట్‌ను ట్యాంపర్‌ చేశారన్న ఆరోపణలతో పది రోజుల క్రితం సంచలన ఆదేశాను ఇచ్చింది నాంపల్లి కోర్టు. తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు తదితర శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్న విరసనోళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు మరో 10 మందిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది.. కోర్టు ఆదేశాలను ఇచ్చి 10 రోజులు దాటినా మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ చేయకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు పిటిషనర్‌ రాఘవేంద్ర రాజు. దీంతో కోర్టు మరోసారి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ కేసులో జోక్యం చేసుకుంది. ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలంటే లెక్క లేదా అంటూ మహబూబ్‌నగర్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేయాలని పోలీసులను మరోసారి ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాక.. నివేదిక ఇవ్వాలని కోరింది నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు.
దీనిపై విచారణ చేసిన కోర్టు ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు వెంటనే ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మంత్రిపై కేసు నమోదు చేశారా? లేదా? అని అడిగింది. మహబూబ్‌ నగర్‌ పోలీసులు కనుక ఎఫ్ఐఆర్‌ నమోదు చేయకపోతే.. దాన్ని కోర్టు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది.
జూలై : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్‌పైన కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను జూలై 31న ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా రాఘవేందర్ రాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, తన అఫిడవిట్ ను ట్యాంపరింగ్ చేశారని రాఘవేందర్ రాజు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలోనే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. మంత్రితోపాటు నలుగురు ఐఏఎస్ అధికారులపైన కూడా కేసులు నమోదు చేయాలని తెలిపింది. వీరిలో ఎన్నికల కమిషన్ కు సంబంధించి రాష్ట్ర, కేంద్ర అధికారులు కూడా ఉన్నారు. అయితే, రాఘవేందర్ రాజు దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టి వేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో హైకోర్టును, ఏకంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, నాంపల్లి కోర్టులో ఉన్న ఆ కేసు పూర్వాపరాలు తెలియకుండా, పిటిషన్ ను పరిశీలించకుండా తాము ఏ నిర్ణయమూ తీసుకోలేమని గతంలొ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు