Friday, May 3, 2024

ప్రభుత్వ భూముల్లో ఉన్న కాలనీలను రెగ్యులర్ చేయాలి..

తప్పక చదవండి
  • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో, అనేక కాలనీలు ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి..
  • జీఓ 118 ఇంప్లిమెంట్ చేయాలి..
  • డిమాండ్ చేసిన తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్..

పేద, మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం తెలిసో తెలియకో 119 నియోజక వర్గాలలో.. ప్రభుత్వ భూమిని కొంత మంది దళారుల ద్వారా కొనుక్కొని కొందరు ఇండ్లు నిర్మించుకున్నారు.. మరి కొంత మంది ఖాళీగా ఉంచుకున్నారు.. ఆ ప్లాట్లను, ఇండ్లను రెగ్యూలరైజ్ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో 58, జీవో 59, జీవో 118 తీసుకు రావడం జరిగింది.. 58, 59 జీవో లలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.. 118 జీవోలో 44 కాలనీల వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.. అందులో 36 కాలనీలు కేవలం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నాయి.. మేడ్చల్ మల్కాజ్గిరిలో రెండు కాలనీలు.. అందులో సాయిప్రియ నగర్, సత్యనారాయణపురం.. కార్వాన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలలో 5 కాలనీలు ఉన్నాయి..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఒక కాలనీ ఉంది.. 58 జీవోలో 120 గజాల వరకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా పట్టాలు ఇస్తారు.. 59 జీవో ప్రకారం 120 గజాల నుండి 1000 గజాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఇది సంపన్నులు, రాజకీయ నాయకుల కోసం తెచ్చారు.. ఈ జీవోలో దరఖాస్తు చేసుకున్న చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు ప్రజెంట్ మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వం డిమాండ్ నోటీస్ పంపడం వలన ఆ డబ్బులు చెల్లించ లేక పోయారు.. వారి ప్లాట్లు రెగ్యూలరైజ్ కాలేదు, కేశవరావు లాంటి రాజకీయ నాయకులకు సంపన్నులకు గజానికి వంద రూపాయలు లాగా తీసుకొని రెగ్యూలరైజ్ చేసినారు, 118 జీవో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఒత్తిడి వలన ప్రభుత్వం 118 జీవో తీసుకురావడం జరిగింది.. గజానికి రూ. 250 కట్టాలి.. ఈ జీవో ప్రకారం ఎల్బీనగర్ లో 18 వేల మంది ధరకాస్తుదారులు ఉంటే వారిలో ఈ రోజు 5 వేల మందికి రెగ్యూలరైజ్ చేసిన సర్టిఫికేట్ లు ఇవ్వడం జరిగింది..

మేడ్చల్ మల్కాజ్ గిరి, పిర్జాధి గూడ మున్సిపాల్టీలో గల సాయిప్రియ నగర్ లో 350 మంది బాధితులు 118 జీవో ధరకాస్తు చేసుకున్నారు.. వారి ప్లాట్లను రెగ్లరైజ్ చేయమని కొన్ని నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఒక్క సారి కలిసిన కలెక్టర్ అమెయ్ కుమార్, మీ ప్లాట్లు రెగ్యూలరైజ్ కావని, దురుసుగా ప్రవర్తించారని సాయి ప్రియ నగర్ కాలనీ బాధిత ప్లాట్ల వారు ఆందోళన చెందుచున్నారు.. పలు మార్లు మంత్రి మల్లారెడ్డి ని కలిసినా పలితం లేదని వారు వాపోయారు.. ఆ ప్లాట్లు రెగ్యూలరైజ్ చేపించండీ అని వారు కనపడ్డ నాయకుడికి మొక్కు చున్నారు.. ఇంకా రాష్ట్రంలో అనేక కాలనీలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయి.. వారి ప్లాట్లు ఇండ్లు 118 జీవో లో రెగ్యూలరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు