- వికలాంగుల హక్కుల చట్టాన్ని విస్మరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం..
- జీఓ లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.. ఎందుకింత చిన్న చూపు?
- రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ లను సైతం కొనసాగించడం లేదు..
- ముత్తినేని వీరయ్య, రాష్ట్ర చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం
జూన్ 21, 2023 న జీఓ నెంబర్ 25ని రవాణా, రోడ్లు, భవనాల శాఖ గృహ నిర్మాణం కొరకు ఇచ్చిన జీఓలో వికలాంగుల హక్కుల చట్టం 2016 కి దీనికి అనుగుణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీ.ఓ ఎం.ఎస్. నెంబర్ 1 తేదీ :16-01-2018 ప్రకారం వికలాంగులకి ఏ సంక్షేమ పథకము, సహకార పథకంలో నైనా 5 శాతానికి తక్కువ కాకుండా కేటాయించాలి.. అలానే వికలాంగుల హక్కుల చట్టం -2016 చాప్టర్ 5 సామాజిక భద్రతలో సెక్షన్ 24-1 ప్రకారం సాధారణంగా ఇచ్చే లబ్ధి లో 25 శాతానికి తక్కువ కాకుండా పెంచి ఇవ్వాలి అని ఉంది.. అనగా గృహలక్ష్మి పథకం ప్రకారం మొత్తం 4 లక్షల ఇండ్లు అంటే, 20వేల ఇండ్లు వికలాంగులకు కేటాయించాలి.. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అంటే వికలాంగుల కి కనీసం 25 శాతం పెంచి ఇస్తే (వికలాంగుల హక్కుల చట్టం 2016, సెక్షన్ 24-1) రూ. 3లక్షల 75వేలు ఇవ్వాలి.. ఈ సెక్షన్ ప్రకారం ఇంకా మానవత్వంతో పెంచి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవొచ్చు.. కానీ ప్రభుత్వానికి కండ్లు కనపడటం లేదు.. జీఓఎంఎస్ నెంబర్ 25లో మిగతా కులాలకు రిజర్వేషన్లు ఇచ్చారు.. బిసిలకి, మైనారిటీలకి 50శాతం, ఎస్సీ లకి 20శాతం, ఎస్టీలకు10 శాతం అని ఇచ్చిన ఈ అధికారుల కండ్లకు రాజ్యంగబద్దంగా ఉన్న వికలాంగుల హక్కుల చట్టం 2016, ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓఎంఎస్ నెంబర్ : 1 ఎందుకు విస్మరించారు.. కేవలం పింఛన్లు ఇచ్చి చేతులు దులుపకుంటున్నారు.. ఇలా చెస్తే సామాజిక న్యాయం లోపించినట్లే కదా!
వరుస తప్పిదాలు :
గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోను ఇదే చేశారు.. అప్పుడు కాంగ్రెస్ వికలాంగుల విభాగము ఉద్యమముతో దిగివచ్చి 5శాతం ఇండ్లు కేటాయిస్తూ.. జీవో విడుదల చేశారు..
దళిత బందు పథకం లోను ఇదే రకమైన అన్యాయం :
మన రాష్ట్రంలో దళితులకు రూ. 10 లక్షల సబ్సిడీ డైరెక్ట్ సహాయం అందించే గొప్ప దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. వికలాంగుల చట్టము సెక్షన్ 37-బీ ప్రకారం, అన్ని రకాల సంక్షేమ పథకాల్లో 5శాతం, అదే విధంగా సెక్షన్ 24-1 ప్రకారం సాధారణంగా ఇచ్చే లబ్దిలో 25శాతం అధికంగా అంటే దళిత వికలాంగులకు రూ. 12 లక్షల 50 వేలు ఇవ్వాలి. గతంలో ఈ చట్టం ఆమోదించి కల్యాణలక్ష్మి పథకంలో 25శాతం అధికంగా ఇవ్వాలని ప్రత్యేక అదేశాలు జీవో ఇచ్చారు. అదే విధంగా అన్ని సంక్షేమ పథకాల్లో 5శాతం ఇవ్వాలని 37బీ ప్రకారం కూడా అదేశాలు (జీఓఎంఎస్ నెంబర్ 1, తేదీ. 16-01-2018) ఇచ్చారు. మన రాష్ట్రంలో చట్టప్రకారం హక్కులు అమలుకు అదేశాలు జీవోలు ఇస్తున్నారు.. కానీ అమలు చేయడంలో జాప్యం, అన్యాయం జరుగుతుంది. దళిత బంధు పథకం ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో 100 మందిలో 5శాతం అనగా 5 దళిత వికలాంగులకు హక్కుగా 25 శాతం లబ్ది అదనంగా అంటే రూ. 12 లక్షల 50 వేలు అందాలి. రాష్ట్ర ప్రభుత్వం కండ్లు ఉండి చుడలేక పోతోంది.. చెవులు వుండి వికలాంగుల బాధలు వినలేక పోతోంది.. పదే పదే వికలాంగులకు సంక్షేమ పథకాలు లో తీవ్ర అన్యాయం చేస్తుంది.. ఇదే ప్రభుత్వం ఇచ్చిన జీవోలని సైతం ఇదే ప్రభుత్వం విస్మరిస్తే ఎట్లా? రాజ్యంగ బద్దంగా వచ్చిన వికలాంగుల హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తోంది.. ప్రతిసారీ వికలాంగులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుంది.. వికలాంగుల సంక్షేమ శాఖ.. కమీషనర్ నిద్ర పోతుంది.. ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తుంది.. వికలాంగులకు వచ్చే లబ్ధిని ఏవరైనా అడ్డుకుంటే వారు వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం నేరం.. ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ : 25 పై ఇచ్చిన వాళ్ళపై వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి.. వెంటనే గృహ లక్ష్మి పథకం లో వికలాంగుల కి 5శాతం కేటాయిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలి. లబ్ధి 25శాతం పెంచి ఇవ్వాలి.. అలాగే దళిత బందులో కూడా దళిత వికలాంగులకు 25 శాతం పెంచి.. రూ. 12.50 లక్షలు ఇవ్వాలి.. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.. వికలాంగుల కోసం ఇచ్చే ప్రత్యేక ఉత్తర్వుల్లో రేషన్ కార్డు మినహాయింపు ఇవ్వాలి.. వికలాంగుడి పేరుమీదనే ఇవ్వాలి.. ఒకవేళ పురుషుడు వికలాంగుడు అతని భార్య సకలాంగురాలు అయితే రేషన్ కార్డులు మహిళల పేరు మీదనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతోంది..