Thursday, May 16, 2024

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం అందజేస్తున్న కటకం సుభాష్, తగరం సత్యనారాయణ

తప్పక చదవండి

మునగనూరు జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని సి ఎస్ కు కేసిఆర్ ఆదేశం

- Advertisement -

దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న మునగనూరు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి ఆదేశించారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న 85 మంది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో పరిష్కారానికి నోచుకోనుంది. గత 14 సంవత్సరాలుగా పెండింగులో ఉన్న మునగనూరు సమస్య ను పరిష్కరించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మలక్ పేట కు చెందిన జర్నలిస్టులు కటకం సుభాష్, తగరం సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, చండీశ్వర్ తదితరులు కలిసి వినతి పత్రాన్ని అందజేసి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కి వివరించారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిపత్రాన్ని సిఎస్ శాంత కుమార్ కి ఇచ్చి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జర్నలిస్టుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు