Saturday, May 18, 2024

సీఎం కేసీఆర్, మంత్రి గంగుల ఫొటో పెట్టుకున్న నాయీబ్రాహ్మణఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్..

తప్పక చదవండి

కులవృత్తి దారులకు ప్రభుత్వం అందించిన లక్ష రూపాయలు అందుకున్న లబ్ధిదారులు మంగళవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోటో ను, రాష్ట్ర బిసి పౌరసరఫరాలు శాఖ మాత్యులు గంగుల కమలాకర్ ఫోటో తన క్షౌరశాల పెట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్

ఈ సందర్భంగా గుంజపడుగు పవన్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కులవృత్తులకు మరీ ముఖ్యంగా నాయీబ్రాహ్మణులకు ఒక లక్ష రూపాయలు ప్రకటించిన సందర్భంగా నేను ప్రథమంగా దరఖాస్తు చేసుకున్నాను. నాకు ఈ పథకం ద్వారా నాకు డబ్బులు తన అకౌంట్ లోకి వచ్చాయని, ఈ డబ్బులు తమకు ఎంతగానో ఆర్థికంగా ఉపయోగపడుతాయని, కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారి జీవితాలలో వెలుగులు తెచ్చే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి ప్రతి నాయీబ్రాహ్మణుడు రుణపడి ఉంటారని అందుకే తాను తన షాపులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, రాష్ట్ర బిసి శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ చిత్రపటాన్ని పెట్టుకుని, ఈ ప్రభుత్వం పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నాను అని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు గుంజపడుగు పవన్ కుమార్ అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు