Thursday, May 2, 2024

క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు క్రమబద్ధీకరణ చేసి, 42,300 రూపాయల వేతనం వెంటనే ఇవ్వాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాయ బండి పాండురంగన్..

హైదరాబాద్, బుధవారం రోజున సిఆర్పిల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని.. సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి అధ్యక్షతన వేలాది మందితో విజయవంతంగా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయబండి పాండురంగం హాజరై ప్రసంగిస్తూ.. తెలంగాణలో కాంట్రాక్టు విధానం రద్దు చేసి క్రమబద్ధీకరణ చేస్తానన్న ముఖ్యమంత్రి పది సంవత్సరాల గడుస్తున్నా ఇంతవరకు ఊసే ఎత్తలేదని.. ముఖ్యమంత్రి చెప్పిన మాటలన్నీ ఆశలు అడియాసలైయని, సి.ఆర్. పి లు కోరుతున్న సమస్యలు చేయదల్చుకుంటే పెద్ద సమస్య కాదని అన్నారు.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నారని, కానీ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ లో ధర్నా కోసమేనా, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తెలంగాణలో దశాబ్ద ఉత్సవాలు కాదు, కానీ దశ దిశ లేని ప్రభుత్వంగా మారిందని, ఇప్పటికైనావెంటనే వీరికి 42,300 రూపాయల వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ఉద్యోగ నోటిఫికేషన్ లో 30 శాతం వెయిటేజ్ కల్పించాలని, ఆరోగ్య సంరక్షణ కోసం ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కార్డులు మంజూరు చేయాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని, అదేవిధంగా హెచ్.ఆర్ పాలసీ కల్పించాలని, తదితర సమస్యలపై పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . వీరు చేసే పోరాటాలకు, సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు వర్కర్స్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, భవిష్యత్ కార్యాచరణలో చలో ప్రగతి భవన్ ముట్టడించాలని, దీనికి వర్కర్స్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంటుందని రాయ బండి పాండురంగం పిఆర్సిలకు అభయమిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నాయకులుపాల్గొని ప్రసంగించారు. సామాజిక తెలంగాణ ఫ్రెంటు రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస పరశురాజ్ పాల్గొని ప్రసంగించారు. సి ఆర్ పి సంఘ రాష్ట్ర కోశాధికారి పడాల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరేగుల సహదేవ్, సంజీవ్, లతో పాటు 1500 మంది ధర్నా చౌక్ లో పాల్గొని జయప్రదం చేశారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు