Monday, October 14, 2024
spot_img

ముఖ్యమంత్రి రాకతో మహేశ్వరానికి మహర్దశ..

తప్పక చదవండి
  • మహేశ్వరానికి మెట్రో రైల్, మెడికల్ కాలేజ్
  • తుమ్మలూరు గ్రామానికి కోటి రూపాయలతో దశాబ్ది కమ్యూనిటీ హాల్
  • 65 గ్రామ పంచాయతీలకు 15 లక్షల చొప్పున స్పెషల్ పండు విడుదల
  • తుక్కుగూడ, జలపల్లి మున్సిపాలిటీలకు చెరొక రూ. 25 కోట్ల నిధులు..
  • బడంగ్ పేట్, మీర్పేట్ మున్సిపాలిటీలకు చెరొక 50 కోట్ల రూపాయలు..
  • హరితోత్సవంలో భాగంగా మొక్కను నాటిన సీఎం కేసీఆర్..

మహేశ్వరం, మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు హరితోత్సవం కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు హరితోత్సవంలో భాగంగా పాల్గొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మన అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. నిజంగానే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రంలో ఒక్కొక్క రంగంలో ఏ విధంగా అద్భుత ఫలితాలు వస్తున్నాయి అనేది గత 18 రోజులుగా మనం చూస్తా ఉన్నాము.. ఏ రంగాన్ని ఎన్నుకున్నా, ఏ రంగాన్ని చూసినా కూడా మన ముఖ్యమంత్రి సాధించిన విజయాలు మనమందరం కూడా కళ్ళకు కట్టినట్టు చూస్తా ఉన్నాము అన్నారు.. ఇక్కడ చాలామంది అక్క చెల్లెలు ఉన్నారు.. నిన్న చూస్తున్నాం మనం నీళ్ల పండుగ జరుపుకొని ఆడబిడ్డలు బిందె ఎత్తుకొని బయటికి పోతే ఆత్మగౌరవంతో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని భగీరథ ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఆడబిడ్డల అందరి తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.. ఒకసారి 2014 కంటే ముందు ఇప్పుడు 2023 మనము గత పది సంవత్సరాల నుంచి చూసుకుంటే రైతుల పరిస్థితులు ఎలా ఉండేవి..? భూములన్ని ఎండిపోయి బీటలు వారి పల్లేరు కాయలు మొలిచేవి.. రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితులలో ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తూ.. తెలంగాణ అభివృద్ధి ఎంతగా ఉందో చూడొచ్చు.. కాబట్టి రైతుల గురించి ఆలోచించే నాయకుడు పైన ఉన్నాడు కాబట్టే ఇది సాధ్యమైంది.. గతంలో ఎన్నో కరెంటు కష్టాలు ఉండేవి. ఎప్పుడు కరెంటు వస్తుందో..? ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితులలో.. పారిన మడే మళ్లీమళ్లీ పారుతూ ఉంటే ఏడు గంటల కరెంటు కూడా చక్కగా లేక, పొద్దున సాయంత్రం ఇస్తా ఉంటే కరెంటు పెట్టడానికి పోయి రైతులు చనిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూశాం.. కానీ ఈరోజు 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తూ.. రైతులకు గాని, పరిశ్రమలకు గాని ఆటంకం లేకుండా చూసిన ఘనత మన ముఖ్యమంత్రి కెసిఆర్ ది అన్నారు.. అలాగే చెరువుల పండుగ చేసుకున్నాం.. గతంలో చూస్తే చెరువులన్నీ ఎండిపోయి చెరువులలో పిచ్చిపిచ్చి మొక్కలు మొలిచేవి.. చెరువులు ఉన్నాయా..? లేవా అనే పరిస్థితి ఎదురయ్యేది.. బతుకమ్మలు ఆడితే చెరువులలో నీళ్లు లేక బకెట్లలో నీళ్లు నింపి వదిలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. పశువులు నీళ్లు తాగాలంటే పశువుల తొట్లు కట్టుకొని నీళ్లు తగ్గించే వాళ్ళం.. కానీ ఇప్పుడు మిషన్ కాకతీయతతో చెరువులన్నింటినీ పూడిక తీసి, ఎర్ర టెండల్లో కూడా నిండుకుండల్లా ఉన్నాయంటే కచ్చితంగా ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఇప్పుడు మన తుక్కుగూడలో చూస్తా ఉన్నాం ఎన్ని కంపెనీలు వచ్చాయి.. అలాగే షాబాద్ లో చూస్తున్నాం ఒక పట్టణంగా తయారైంది.. ఎక్కడ చూసినా కూడా ఈ పరిశ్రమలు ఇక్కడికి రావడానికీ ముఖ్యమంత్రి ఒక రీజన్ అయితే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ కోఆర్డినేషన్.. మన అందరి తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇక విద్యా, వైద్యానికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు.. విద్యకు సంబంధించి ఒక వెయ్యి పై చిలుకు గురుకులాలను ఏర్పాటు చేసి పేద బిడ్డలకి నాణ్యమైన విద్యను అందించే గొప్ప రీజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో హాస్పిటల్ కి పోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ తప్ప ఇంకోటి ఉండేవి కావు కానీ ఈరోజు పల్లె దవఖానాలు, బస్తీ దవాఖానాలు అని మన దగ్గర ఎల్బీనగర్లో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మన అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు.. అందులో భాగంగా మహేశ్వరానికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు. అదేవిధంగా మన దగ్గర ఫాక్స్ కాన్ కంపెనీ రావడం వల్ల లక్ష మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అన్నారు.. దీనివల్ల అటు ఇబ్రహీంపట్నంకు ఇటు మహేశ్వరానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.. అలాగే ఫార్మాసిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్న సందర్భంగా ఈ ప్రాంతమంతా భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి మెట్రో ట్రైన్ ఇక్కడ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ముఖ్యమంత్రి ని కోరారు. అదే కాకుండా ఈ ప్రాంతాలలో జనాభా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీర్పేట్, బడంగ్పేట్ మధ్యలో ఒకటి.. తుక్కుగూడలో ఒకటి.. 100 పడకల హాస్పిటల్ అయినా గానీ 50 పడకల హాస్పిటల్ అయినా గానీ మంజూరు చేయమని ముఖ్యమంత్రిని కోరారు. మహేశ్వరం ఏరియాలో చాలా విల్లాస్ ఏర్పాటు అయితున్నాయి.. కాబట్టి ఒక సబ్ స్టేషన్ ను కొత్తగా ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అలాగే మన సభా ప్రాంగణం తుమ్మలూరు లో ఏర్పాటు చేశాం.. మీరు ఏదో ఒక చిన్న వరం తుమ్మలూరుకి ఇవ్వాలని కోరుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..
దేశంలో వడ్లు పండించడంలో మన తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది.. వడ్లు పండించడం లోనే కాదు మరెన్నో రంగాలలో తెలంగాణ నెంబర్ వన్ స్థానాలలో నిలిచిందన్నారు.. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంతో పచ్చగా తయారైంది అన్నారు.. తుమ్మలూరులో నాలుగు సంవత్సరాల క్రితం పెట్టిన చెట్లు పెరిగి ఎంతో పెద్దవిగా తయారయ్యాయి అని అన్నారు.. తెలంగాణలో ఏడూ పాయింట్ 7 శాతం విస్తీర్ణం పచ్చగా పెరిగిందన్నారు.. ఇదంతా పూర్తిగా మాటలు చెప్తే పెరగవని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల కూడా కాలేశ్వరంతో పాటే పూర్తయ్యేటివి ఈపాటికి.. అన్ని కట్టినం రిజర్వాయర్లు అయిపోయినాయి.. ప్రాజెక్టులన్ని నింపే వాళ్ళం ఈపాటికి కానీ కొంతమంది సుప్రీంకోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చి అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఏదేమైనా భగవంతుని దయవల్ల ప్రాజెక్ట్ 25 శాతం పూర్తయింది మహేశ్వరం ఇబ్రహీంపట్నం అట్లాగే మన వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది.. నేను మీకు హామీ ఇస్తున్నాను 100శాతం ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువస్తాను.. అంతేకాదు మీ అందరికీ నేను ఒక తీపి కబురు చెబుతున్నా గోదావరి నీళ్లు మన గండిపేట, హిమాయత్ సాగర్ లోకీ తీసుకువస్తాను. కెసిఆర్ ప్రారంభించిన కార్యక్రమం ఇక్కడ మన తుమ్మలూరులో ఎంతో బాగా కనిపిస్తా ఉన్నది.. మన కరుణాకర్ రెడ్డి చేసిన కృషి ఎంతో కనబడుతుంది అన్నారు. ఇంతకుముందు పనిచేసిన సర్పంచ్లకు ఈ కీర్తి దక్కలేదు కాబట్టి ఇప్పుడున్న ఈ సర్పంచులు ఈ హరితవనాన్ని ఎప్పుడు సంరక్షిస్తూ ఉండాలని.. ఇంకేమైనా నిధులు కావాలంటే నేను మీకు అందిస్తానని చెప్పారు. తెలంగాణలో 276 కోట్ల మొక్కలని ఇప్పటికే నాటామన్నారు.. ఏ ఊరికి ఆ ఊర్లో నర్సరీ పల్లె ప్రకృతి దాంట్లో పిల్లలకు ఓపెన్ జిమ్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తా మన్నారు.. అర్బన్ పార్కులు కూడా చాలా బ్రహ్మాండంగా దాదాపు176 అర్బన్ పార్కులు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయన్నారు.. ఇంకా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నారు. ఈ విజయం మన అందరి విజయం మన అందరి సమిష్టి విజయం అన్నారు.. తెలంగాణ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం నుండి ప్రజలకు అవసరమైనటువంటి పండ్ల మొక్కలను ఫ్రీగా పంచడానికి వందకోట్ల బడ్జెట్ ను పెట్టి పలవృక్షాలు పెంచండి.. పల్లెల్లో ఫ్రీగా ప్రజలకు సప్లై చేయండి.. సర్పంచులకు ఈ బాధ్యతను ఇస్తే వారే పంచి పెడతారని చెప్పారు. అదికూడా మొదలు పెట్టామన్నారు.. మన ప్రాంత స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మన ఇంటి ఆడపడుచు.. నన్ను కొన్ని కోరికలు కోరారు.. ఇంటి ఆడపడుచు కాబట్టి అడిగే హక్కు బాధ్యత ఆమెది.. ఆమె కోరిక నెరవేర్చే బాధ్యత నాది అన్నారు.. మహేశ్వరానికి ఒక మెడికల్ కాలేజీ కావాలన్నారు కాబట్టి మహేశ్వరానికి మెడికల్ కాలేజీని ఇస్తున్నాను.. అదేవిధంగా తుమ్మలూరుకి ఒక సబ్ స్టేషన్ కావాలన్నారు.. అది కూడా కచ్చితంగా మంజూరు చేస్తున్నాను. దాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేస్తామన్నారు.. అదేవిధంగా మెట్రో లైన్ మహేశ్వరం వరకు కావాలని సబితా కోరారు.. అది ఆమె న్యాయమైన కోరిక.. మన రాష్ట్రంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మెట్రో రైలు ఇక్కడ వరకు రాలేదు.. ప్రతి పట్టణాలలో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లైన్ ఉంటుంది.. ఎక్కడో తప్పు జరగడం వల్ల ఇక్కడ వరకు రాలేకపోయింది.. ప్రతి ఎయిర్పోర్ట్ కి మెట్రో అనేది గ్యారెంటీగా పెడతారు.. ఇప్పటికే శంషాబాద్ వరకు మెట్రో లైన్ వస్తుంది.. అక్కడ నుండి మహేశ్వరానికి తీసుకురావడం ఎంతో సులవైన పని.. మహేశ్వరానికి, బీ.హెచ్.ఈ.ఎల్. కు, అలాగే కందుకూరు వరకు మెట్రో లైన్ తీసుకురావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాను.. కచ్చితంగా తెచ్చే ప్రయత్నం చేస్తానని నేను మాట ఇస్తున్నాను. ఇంతకుముందు వేరేవాళ్లు మీరు అన్నం తినే బియ్యం కూడా మేమే పండిస్తున్నామన్నారు.. మీకు వ్యవసాయం రాదన్నారు.. కానీ ఇప్పుడు వారు 15 లక్షలు పండిస్తున్నారు మనం 56 లక్షలు పండిస్తున్నాము.. మనల్ని వెక్కిరించిన వాళ్ళు ఏడవ స్థానానికి వెళ్లారు. ఇటుక పైన ఇటుక పెట్టి పేర్చినట్టుగా ఎన్నో సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకు పోతా ఉన్నామన్నారు.. గతంలో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో తెలంగాణలో సంక్షేమ పథకాలు ప్రతిరోజు మీ ఊర్లలో జరుగుతా ఉన్నాయి మీరు చూస్తా ఉన్నారు అన్నారు.. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు దివ్యాంగ సోదరులని ఎవరు పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు ఇచ్చే 3,116 /- రూపాయలు కాకుండా మరో వెయ్యి రూపాయలు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పెంచినాను.. ఇలా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కడుపులో దాచుకుంటూ ఎన్నో పథకాలను ప్రవేశ పెడుతున్నానన్నారు.. ఈరోజు మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.. తలసరి ఆదాయంలో అత్యధిక ధాన్యం పండించడంలో.. 24 గంటలు కరెంటు ఇచ్చే విషయంలో.. తెలంగాణ నెంబర్ వన్ అన్నారు.. ప్రతి ఇంటికి నల్లా బిగించి రోజు క్రమం తప్పకుండా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అన్నారు.. 100శాతం ఓడిఎఫ్ సాధించిన విషయంలో తెలంగాణ నెంబర్ వన్ అని వివరించారు.. అలాగే తుమ్మలూరులో సబితా ఇంద్రారెడ్డి, సర్పంచ్ సురేఖ కరుణాకర్ రెడ్డి అడిగినందువల్ల ఒక కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ ని మంజూరు చేస్తా ఉన్నాను.. ఆ కమ్యూనిటీ హాల్ కు దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని పేరు పెట్టమన్నారు. అలాగే మిగతా సర్పంచులు నామీద కోప్పడకుండా ఇక్కడ ఉన్న 65 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామపంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున స్పెషల్ ఫండ్ విడుదల చేస్తున్నాను.. వీటితో మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.. అలాగే ఈ నియోజకవర్గంలో జల్పల్లి, తుక్కుగూడ రెండు మునిసిపాలిటీలకు చెరొక్క 25 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేస్తామన్నారు. అలాగే బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపాలిటీలకు చెరొక్క 50 కోట్ల రూపాయలను విడుదల చేస్తామన్నారు.. అలాగే ఫారెస్ట్ అధికారులు మనందరి కోసం ఎంతో ఎంతో కష్టపడి అడవులు పెంచుతున్నారు.. ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్ట్ అధికారిని అతి దారుణంగా చంపేశాడు.. చనిపోయిన అధికారి కుటుంబానికి కొంత డబ్బు సాయం చేశాము.. చనిపోయిన మనిషిని అయితే తేలేము కాబట్టి వారి కూతురికి ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి కొన్ని అటవీశాఖ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది.. ఒక 20 పోలీస్ స్టేషన్ల వరకు అవసరమైతాయి అని చెప్పారు.. వాటిని వెంబడే మంజూరు చేస్తాం.. ఫారెస్ట్ అధికారులకు ఏమేం సేవలు అవసరమో అవన్నీ తప్పకుండా చేస్తామన్నారు.. అలాగే ప్రతి ఒక్కరూ పండ్ల చెట్లను మొక్కలను పెంచుకోవాలన్నారు.. తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రమని అన్నారు.. రాష్ట్రం ఎప్పుడు పచ్చగా సుభిక్షంగా ఉండేలా చేయాలన్నారు.. ప్రతి ఒక్కరూ చెట్లని తమ పసిపిల్లల్లాగా చూసుకోవాలన్నారు.. పిల్లలను ఎలాగైతే సాధుతామో చెట్లను కూడా ప్రతి ఒక్కరూ అలాగే సాదుకోవాలన్నారు.. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నాకు తెలుసు.. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పి చైర్పర్సన్ తీగల అనిత హరినాద్ రెడ్డి, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు