Friday, September 20, 2024
spot_img

బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాల గ‌డువు పొడిగింపు..

తప్పక చదవండి
  • ఈనెల 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..
  • దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్ కోటా విద్యార్థుల‌కు
    ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం..
  • ఓసీ, ఓబీసీ విద్యార్థులకు ఫీజు రూ. 500 చెల్లించాలి..
  • ఎస్సీ, ఎస్టీ, స్టూడెంట్స్ లు రూ. 450 చెల్లించాలి..
  • వయసు 18 ఏళ్ళు మించరాదన్నది నిబంధన..

హైదరాబాద్, బాస‌ర ఆర్జీయూకేటీలో ప్ర‌వేశాల ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్ కోటా విద్యార్థుల‌కు ఈ నెల 27వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఆర్జీయూకేటీకి ఎంపికైన అభ్య‌ర్థుల జాబితాను జులై 3వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బాస‌ర ట్రిపుల్ ఐటీ అధికారులు వెల్ల‌డించారు.. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి. పదోతరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ తెలిపారు. 18 సంవత్సరాలు మించిన విద్యార్థులకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు