Saturday, May 18, 2024

ఆత్మవిశ్వాసాన్ని నింపే అక్షర నేత్రాలు

తప్పక చదవండి

సాహిత్యంలో కవిత్వం ఒక అద్వితీయమైన ప్రక్రియ కవిత్వంతో మనుసును కట్టిపడవచ్చు ఆలోచింప చేయవచ్చు ప్రముఖ కవి సాహితీ విప్లవ యోధుడు శ్రీశ్రీ గారు అన్నట్లు ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వం ఒక తీరని దాహం. అనే అందుకు ఎన్‌ లహరి రచించిన అక్షర నేత్రాలు ఒక నిదర్శనంగా చెప్పవచ్చు లహరి తనదైన శైలిలో కుటుంబాన్ని సమాజాన్ని ప్రపంచాన్ని ప్రకృతిని అధ్యయనం చేసి తనలోని ఆలోచన కవిత్వంగా మనిషి తన అక్షర నేత్రాలతో మనలోని సాహితీ చైతన్య నేత్రాలను తెరిపించారు. నేటి సాంకేతిక ప్రపంచంలో యువత వాట్సాప్‌ యూట్యూబ్‌ల లోకంలో తెలియాడుతుంటే అందరూ మహిళా మణులు తమ కాలాన్ని టీవీ సీరియల్‌ తో గడిపేస్తున్న తరుణంలో లహరి మాత్రం తన జీవితాన్ని సమాజంతో మేలవించి కవిత్వంతో కట్టిపడేసి మన హృదయాలను తన కవిత్వంతో తట్టి లేపుతున్నారు నేటి గృహిణీమణులు పిల్లలు భర్త బాగోగులు ఇంటిపని వంట పనితో క్షణం తీరిక లేకుండా కాలంతో కొట్టుకుపోతుంటే హరి మాత్రం తనకున్న కాస్తంత సమయాన్ని క్షణం క్షణం కూడా పెట్టుకుని ప్రతిక్షణం అక్షరానికై ధారపోసి అక్షర నేత్రాల కవితా శీర్షికకు పోశారు. లహరి గారు నిరంతరం జ్వలించే అక్షర జ్వాల నిరంతరము ప్రవహించే కవిత నది ప్రవాహం కొంతకాలం పాటు తనలోని సాహిత్యాన్ని కవిత్వాన్ని తనలోనే అనుచుకొని ఒకేసారి అగ్నిపర్వతంలా జ్వలించి ప్రజ్వలించి అక్షర నేత్రాలై మన ముందుకు ఎగిసిపడిన ఈ అక్షర నేత్రాల కవితా శీర్షిక మనలోని జ్ఞాన నేత్రాలను తెరిపిస్తుంది. మన జీవితాలలో స్ఫూర్తిని నింపుతుంది ఆగిపోతే మరణంతో సమానం/సాగితే సమరంతో సమానం/నువ్వే స్ఫూర్తి/నిన్ను నువ్వే భుజం తట్టుకొని లక్ష్య దిశగా సాగిపో/విజయ పరంపర నీవెంటే అంటూ స్ఫూర్తిని నింపారు లహరి కష్టాల కడలిని/మౌనంగా జయిస్తే/ఆకాశమే నీ గెలుపుకు తలవంచదా! లక్ష్యం మరువక/అలసట ఎరుగక సాగిపోతే/ నవచైతన్యమే వెల్లివిరీయదా! అంటూ జీవిత మార్గదర్శకాన్ని తెలియజేస్తున్నారు కవిత్రి లహరి నేటి సమాజంలో మనిషికి మనిషికి మధ్య దూరం పెరుగుతున్న సందర్భంలో మంచి స్నేహం కావాలి ఒక నేస్తం కావాలి అంటూ. ఆకాశమంత విశాల హృద యంతో/కూడా మీలాంటి ఓర్పు సహనంతో/స్నేహమంటే ప్రాణమిచ్చే ఓ నేస్తం కావాలి. అంటూ నిజమైన స్నేహానికి అర్థం తెలిపారు కవయిత్రి లహరి నేటి యువతలో రాను రాను భక్తి దేశభక్తి తగ్గిపోతున్న తరునములో దేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ నెత్తుటితో చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలబడ్డ భరతమాత ముద్దు బిడ్డలెందరో ఎందరెందరో ఎన్నో త్యాగాలు మరెన్నో ప్రాణాలు/ భరతమాత దాస్య శృంకలాలను పగలగొట్టి/స్వాతంత్రం తెచ్చిన సమరయోధులను స్మరిధాం/దేశ ఔన్నత్యాన్ని శిఖరాలపై నిలబెడ దాం అంటూ దేశభక్తిని గుర్తు చేశారు కవయిత్రి లహరి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి మూల కారణం వ్యవసాయం వ్యవసాయానికి వెన్నుముక రైతు ఈ రైతు బ్రతుకు చిత్రాన్ని తెలియజేస్తూ ఓ కర్షకుడా!/లోకాన్ని బ్రతికించే హాలదరుడా/నింగి చంద్రుడుని మించిన/నేల జాబిలి నువ్వు/నెల రాజు వాడు/నేల రాజు రైతు అంటూ నేల తల్లికి రైతుకు ఉన్న బంధం ఏమిటో తెలియజేశారు కవయిత్రి లహరి నేటి సమాజంలో మహిళల పాత్ర అద్వితీయమైనది శ్రీ లేనిదే సమాజ పురోగమనలేదు అయినప్ప టికీ నేటికీ స్త్రీలు అంటే చిన్న చూపే అయినప్పుడు ఓపికతో ఒదిగి ఉన్న మహిళలకు చైతన్యాన్ని ఇస్తున్నారు లహరి ఎన్ని యుగాలు నాటిదో కదా ఆ ఓపిక/ఎన్ని వేల ఏళ్ల నాటిదో కదా ఆ సహనం/ఓటమిని ఎదుర్కొనే స్ఫూర్తిని నింపి/గెలుపు నందించిన ఇలలో కొలువైన/ఇలవేల్పు ఇల్లాలు/ఇలా….. స్త్రీ లేనిదే జీవం లేదు/ స్త్రీ లేనిదే సృష్టి లేదు/ఈ మాటలను ఆచరించు/మూర్తులను ఆదరించు/అసమానతలను అధిగమించు/ఉన్నత శిఖరం అధిరోహించు/అంటూ స్త్రీ శక్తికి తన యుక్తిని ధారపోశారు కవయిత్రి లహరి తెలంగాణ చరిత్రకు సంస్కృతికి మూలాధారమైన సంబరం బతకమ్మ సంబరం తెలంగాణ ప్రకృతి రమణీయతను తెలియజేస్తూ తెలంగాణలోని స్త్రీమూర్తులు జరుపుకునే అహ్లాదకరమైన హృదయపూర్వకమైన పండుగ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తూ కవిత్వానికి రూపాన్ని ఇచ్చారు. అతివలు ఆడే అందమైన పండుగ/ప్రకృతిని పూజించే పారిజాత పండుగ/బంగారు బతుకమ్మ/బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ బతుకమ్మను తన సాహితీ అక్షర చైతన్య కవిత్వంతో కొనియాడారు రచయిత్రి లహరి నాన్న మాటలకే అందని అర్థం మనసుకు చిక్కని పరమార్థం. మా నాన్నంటే/దిక్కుతోచని స్థితిలో ఏకాకినై విలపిస్తు న్నప్పుడు/నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లను తుడిచే అపన్న హస్తం/మా నాన్నంటే మాటలకందని అనురాగం/మాటలు చాలని ఆప్యాయత/నాన్న మీద ప్రేమను ఈ కవిత్వంలో తెలియజేశారు. నేటి సాంకేతిక ప్రపంచంలో కనుమరుగ వుతున్న పచ్చదనం అభివృద్ధిని ఆశయంగా భావించి పచ్చని ప్రకృతిని మంటగలిపేస్తున్నాం మనం లేని వనం జలం లేని జనం కవితలో ప్రకృతి ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ప్రాణవాయువు ఉనికి లేదు/ఊపిరాడని ఉపరితలం/గొంతు తడవక నలువైపులా/కానరాని చుక్క జలం/జల భాషా జలగోష వింటూ/పసిడి వంటి నీటి బొట్టుని/ఒడిసిపట్టి ఆలోచనలు ఒద్దికగా/నేర్చుకోమని వినబరంగా వినిపిస్తూ/ఇంకిపోతున్న జల నిధిని కాపాడుకునేందుకు/ఓ మనిషి కదలి రాకుంటే/తుదకు కన్నీరు కూడా ఇంకిపోగలదు/ఇకనైనా ఇప్పుడైనా మారితే సరే/ లేకుంటే నీ మెడకు ఊరే/అంటూ కవిత్రీ తనదైన శైలిలో ప్రకృతి లోని వనాల జనాల బాధను తెలియజేశారు. నేడు అరచేతిలో చరవాణి పాత్ర అంతా కాదు చెప్పలేనంత అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ/బంధాలను బలి చేస్తుంది/రక్షణ సేవలో తరించే భాగ్యంతో పాటు/సోమరి తనకు ఊబకాయం ఉచితం/బద్దకపు బాన పట్టా బోనస్‌/భర్త పిలిచిన బిడ్డ ఏడ్చిన/భార్య అరిచిన చెంప చరిచినా/లేని గుణం/ అందుకే చరవాణి/మంచి కోసం వాడితే మధురవాక్యం/కోసం ప్రయత్నిస్తే మరణ కావ్యం/చరవాణితో కాలం గడిపే ఎందరో పక్కన ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో వారి జీవితం అగమగోచరంగా ఉందనటానికే ఈ కవిత శీర్షిక నిదర్శనం. నా అక్షరాలు ఒకచోట పుష్పాలు/పిండితే శ్రమించే భాస్పాలు/అమ్మ అని పిలిస్తే అది అక్షరం/ప్రేమ జ్వలిస్తే అది భాస్వరం/కేవలం చూసేవే కాదు దర్శిం చేవి నా నేత్రాలు/అందుకే అంటాను/నా అక్షర నేత్రాలు ప్రజల గోత్రాలు/తనదైన శైలిలో మంచి సాహిత్యాన్ని కవిత్వాన్ని అందించిన లహరి మరెవరో కాదు తెలంగాణ సాహితీ పూతోటలో తంగేడు పూల నానీలను ఊహించిన తెలంగాణ సాహి తీ సమరయోధుడు నానీల పితామహుడైన డాక్టర్‌ ఎన్‌ గోపికి స్వయానా తమ్ముడు కూతురు అంటే మనకు అర్థమవుతుంది లహరి సాహితీపు తోటలో పరిమళించిన అక్షర పుష్పం ఆమె కవిత్వం మరెన్నో అక్షరాలకు పురుడు పోసి మనలో సాహిత్య చైతన్యాన్ని నింపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అక్షర నేత్రాలతో తనలోని సాహిత్య మనకి అర్థమవుతుంది. లహరి మరెన్నో కవిత పరిమళాలను అందించాలని కోరుకుంటూ..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు