- కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన కాలేజీల్లో మార్పులు..
- ఈ నెల 22 వరకు వెబ్ అప్షన్లకు అవకాశం..
- 26 నాడు ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు..
హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నాలుగు కాలేజీలు మంజూరు కాగా.. కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. గురువారం నుంచి ఈ నెల 22 వరకు ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించారు. ఈ నెల 26న ప్రత్యేక విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఉండనున్నది. స్పాట్ అడ్మిషన్లకు 26న మార్గదర్శకాలు విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ కోర్సులకు చెందిన సీట్లు 4వేలకుపైగానే ఖాళీగా ఉన్నాయి. సీఎస్‌సీలోనే 3వేలకుపైగా సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో 2505, ఈసీఈలో 2721, ఈఈఈలో 2630, ఐటీలో 1785, మెకానికల్‌లో 2542 సీట్లు అందుబాటులో ఉన్నాయి.