Thursday, May 2, 2024

కేంద్రం రద్దు చేసిన చేనేత పథకాలని పునరుద్ధరించాలి..

తప్పక చదవండి

హైదరాబాద్,
కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత రద్దు చేసిన చేనేత పథకాన్ని పునరుద్ధరించాలని బిజెపి పార్లమెంటరీ సభ్యురాలు భారతి బెన్ ధీరు భాయ్ షాల్ కు వినతిపత్రం అందజేశారు సోమవారం పోచంపల్లి సహకార సంఘం లో చేనేత రంగ సమస్యల అధ్యయనం కోసం వచ్చి ఆమెను కలిసిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోల్ల శివశంకర్, మునుగోడు చేనేత సహకార సంఘం డైరెక్టర్ అవ్వారి భాస్కర్ లు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నేతన్నల కోసం అమలులో ఉన్న చేనేత పథకాలను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.. కేంద్రం రద్దు చేసిన పథకాలు మచ్చుకు కొన్ని..

  1. నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డ్ రద్దు.. 2. నేషనల్ టెక్స్టైల్ బోర్డు రద్దు.. 3. నేషనల్ హస్తకళల బోర్డు రద్దు.. 4. హోం ఫర్ వర్క్ షెడ్ రద్దు.. 5. మార్కెటింగ్ ఇన్సెంటివ్ రద్దు.. 6. త్రిబుల్ ఆర్ పథకం రద్దు.. 7. ఐ సిఐసిఐ లంబాడి హెల్త్ స్కీం రద్దు.. 8. మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన, పథకం రద్దు.. 9. నేషనల్ పవర్లూమ్ బోర్డ్ రద్దు.. 10. దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది నేషనల్ టెక్స్టైల్ పరిశోధన సంస్థల రద్దు.. 11. హంక్ యారాన్ (చిలుపనూలు) దేశంలోని నోలు ఉత్పత్తి చేసే స్పిన్నింగ్ మిల్లులు 40 శాతం చేనేత అవసరాల కోసం సప్లై చేసేవారు మోడీ వచ్చిన తర్వాత దాన్ని 15 శాతానికి తగ్గించడం జరిగింది. దీనివల్ల నూనె ధరలు పెరిగి ముడి సరుకు అందుబాటులో లేకుండా పోయి చేనేత వృత్తికి తీరని అన్యాయం చేసిందన్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కాలేజీ రాష్ట్ర విభజన పంపకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడం జరిగింది. అందువల్ల తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక జనాభా చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హ్యాండ్లూమ్ టెక్నాలజీ కాలేజీని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేటాయించవలసిందిగా కేంద్రాన్ని కోరడం జరిగింది.12. చేనేత, పవర్ లూమ్ మొగ్గాల ఆధునికరణ కోసం పథకాలు రూపొందించాలి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక మంది చేనేత కార్మికులు వృత్తి ఆధారపడి జీవనం క కొనసాగిస్తున్నారు కావున కేంద్ర ప్రభుత్వం మెగా క్లస్టర్లను వెంటనే మంజూరు చేయాలన్నారు.. చేనేతపై కేంద్ర విధించిన జీఎస్టీ ని ఎత్తివేయాలని లేనిచో వృత్తి కనుమరుగయ్యి భవిష్యత్ తరాలు మ్యూజియంలో చూసే వస్తువుగా చేనేత ఉత్పత్తులు చూసుకునే పరిస్థితి దాపురిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు 2 లక్షల రూపాయల వ్యక్తిగత రుణాన్ని ఎలాంటి పుచికత్తు లేకుండా అందించాలి. కేంద్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ట్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్ లో ఉన్న క్లస్టర్లను వెంటనే మంజూరు చేయాలి.. గతంలో సాంక్షన్ చేసిన క్లస్టర్లకు నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇల్లు లేని చేనేత కార్మికులకు ఇల్లు మంజూరు చేయాలి.. 80 సంవత్సరాలు పైబడిన వృత్తి చేస్తూ మరణించిన చేనేత కార్మికులకు కేంద్రం మత్స్యకారులకు ఇచ్చే విధంగానే చేనేత కార్మిక ఐదు లక్షల బీమా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి అన్ని పథకాలను పునరుద్ధరించాలని మరోమారు డిమాండ్ చేశారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు