Friday, May 3, 2024

బిఆర్ఎస్ దేశంలోనే ఫెయిల్యూర్ గవర్నమెంట్

తప్పక చదవండి
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసును
  • ఏర్పడిన తరువాత ప్రజలను మోసం చేసింది
  • బీజేపీ కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేస్తుంది
  • తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు
  • బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు
  • అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి 90 సీట్లు మేమె గెలుస్తున్నాం
  • ప్రజలకు మెరుగయిన పాలన అందించడం ఒక్క బీజేపీకే సాధ్యం
  • ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ఎస్ ప్రభాకర్ ముఖాముఖి

హైదరాబాద్ : బిఆర్ఎస్ దేశంలోనే అత్యంత దారుణమైన ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రేసులో చేరుతామని కాంగ్రేసు పెద్దలను .. బంగారు తెలంగాణ కళను సాకారం చేస్తామని తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేశారని.. ఇంకా చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. బీజేపీ దేశంలో.. కమిట్మెంట్ తో నిర్ణయాత్మకమైన ఆలోచనలతో ముందుకుసాగుతుందని.. రాష్ట్రంలో అదే తరహా పరిపాలన కొనసాగిస్తామన్న భరోసా ప్రజలకు కలిగిందని అందుకే ఈ సారి తప్పక తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం కల్పిస్తారన్న పూర్తి విశ్వాశం తమకు ఉందని ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. బి ఆర్ ఎస్ రాష్ట్రంలో ఎక్స్ పైర్ అయిపోయిందని పేర్కొన్న అయన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలఫై ఉద్యమిస్తున్న బీజేపీ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్య వంతులను చేసే బృహత్ కార్యక్రమాన్నీ భుజాన వేసుకుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి గాని 90 కి పైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగయిన పాలనా అందించడం ఒక్క బీజేపీకే సాధ్యమన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తో ఆదాబ్ ప్రతినిధి ముఖాముఖి..

ఆదాబ్ ప్రతినిధి :- సర్ నమస్కారం.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఎలావుంది ..?
ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్:- బేషుగ్గా ఉంది .. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలఫై బీజేపీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే ఉంది
ఆదాబ్ ప్రతినిధి :- దేశం లో కేంద్ర ప్రభుత్వం పనితీరు ఎలావుందీ..
ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్:- మోదీ దేశ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో లెక్కపెట్టలేనన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దేశం అనేక రంగాల్లో ప్రగతిని సాధించింది . కోవిడ్ లాంటి ఉపద్రవాలను సైతం కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది. బీజేపీ మూడోసారి కేంద్రంలో.. తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం పక్కా అని రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను చూస్తుంటే ఇట్టే అర్ధం అవుతుంది.
ఆదాబ్ ప్రతినిధి :- ప్రభుత్వ వైఫల్యాలపై చెప్పాలంటే ముఖ్యంగా మీరు ఎం చెబుతారు..
ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్:- నీళ్లు, నిధులు, నియామకాల రూపకల్పనే ద్యేయంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు అప్పులకుప్పగా మారిపోయింది. ఇంటికో బీరు,వీధికో బారు అన్నచందంగా బంగారుతెలంగాణ కల .. నెరవేరని కలగానే మిగిలిపోయింది. నిజానికి ఒక కుటుంబం బాగుకోసమే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిందా..ఒక కుటుంబం బాగుకోసమే.. ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను అర్పించుకున్నారా అని చర్చించుకుంటున్నపుడు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదం తెలంగాణ రాష్ట్ర సాకారం. కానీ రాష్ట్రము ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీలేదు.
ఆదాబ్ ప్రతినిధి :- అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేయలేదా..
ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్:- స్మశానాలను అతిసుందరంగా తీర్చి దిద్దతున్న ప్రభుత్వానికి విద్యార్థుల బడుల మొండి గోడలు ఎందుకు కనబడటం లేదు. ఇంటికో బీరు . వీధికో బారు అని ఆలోచిస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఇంటిలో గౌరవంగా బ్రతకాలనుకునే నిరుద్యోగి ఎందుకు కనబడటం లేదు.. రెవెన్యూ సిస్టంలో తప్పులు కనబడుతున్న ప్రభుత్వానికి గ్రామాల్లో మాయమవుతున్న చెరువులు ఎందుకు కనబడటం లేదు.. తమ ఎమ్మెల్యేలు తప్పు చేశారని బహిరంగంగా చెప్పగలిగిన దైర్యవంతుడయినా ముఖ్యమంత్రికి తప్పు చేసిన ఎమ్మెల్యేల పేర్లు చెప్పడానికి ఎందుకు దైర్యం చాలడంలేదు .గడిచిన తొమ్మిదేండ్లలో ఎన్నడు గుర్తురాని చేతి వృత్తి కులాలు.. ముఖ్యమంత్రికి ఎన్నికలముందే ఎందుకు గుర్తొచ్చాయి. ఏ ప్రాతిపదికన దళిత బందు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కిచిన ప్రభుత్వం . ఫీజు రీయంబర్సుమెంట్ ను పాతాళానికి తొక్కేసింది.రేపు మాపంటూ చెప్పుకుంటూ పోతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని ఎప్పుడు చేపడుతారు. అర్హులకు రేషన్ కార్డులెందుకివ్వడం లేదు. కాటికి కాలు చాచిన వృద్దులకు పెన్షన్లను సకాలంలోఎందుకివ్వడం లేదు. నిజానికి వింతంతువులు ఈ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారో ప్రభుత్వానికి లెక్కలు తెలుసా.. కొవిడ్ తరువాత చితికిలబడ్డ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఆసరా ఏంటి.. ఇవన్నీ ప్రభుత్వం జవాబు చెప్పలేని ప్రశ్నలు
ఆదాబ్ ప్రతినిధి :- తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది..
ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్:-
తెలంగాణ ప్రభుత్వం ప్రజలవిశ్వాసాన్నిపూర్తిగా కోల్పోయింది. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు . ఈ సారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 కి గాను 90 కి పైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది
ఆదాబ్ ప్రతినిధి :- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో.. మీ పొత్తు ఎలా ఉండబోతుంది.
ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్:-
ఇప్పటి వరకు బీజేపీ స్వంతంగా ఎదగడానికే.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే ప్రయత్నించింది. నాకు తెలిసినంత వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుంది. టీడీపీతో పొత్తుపై హై కమాండ్ నుంచి స్పష్టత లేదు.
ఆదాబ్ ప్రతినిధి :- మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.
ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్:-
గతంలో నేను ప్రాతినిధ్యం వహించిన ఉప్పల్ నియోజక వర్గం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఆదేశానుసారం పోటీ చేస్తాను.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు