Saturday, July 27, 2024

కొండెక్కిన కోడిచికెన్‌ ధరలు.

తప్పక చదవండి

అసలే పెళ్లిళ్ల సీజన్,శుభ కార్యాలు జరిగే కాలం, భగ్గుమన్న ఎండలతో నోరూరించే చికెన్ ధరలు కొండెక్కాయి.చికెన్ ధరలు పెరగడంతో చికెన్ ప్రియులు షాక్ కి గురి అవుతూ వున్నారు. రోజూ రూ.10 చొప్పున పెరుగుతూ జేబులు గుల్ల చేస్తూ వున్నాయి. చికెన్‌ ధరలు అమాంతం పెరిగాయి. వారం కిందట ఉన్న ధర ఏకంగా రూ.60 నుంచి రూ.70 వరకు పెరిగింది. దాంతో ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.300వరకు పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్‌ ధర రూ.280 దాటడంతో మాంసం ప్రియులు దానికి దూరమవుతున్నారు. అన్ని జిల్లాల లో హోల్‌సేల్‌ దుకాణాలలో కిలో ధర రూ.280 ఉండగా, కాలనీలు, రిటైల్‌ దుకాణాలలో రూ.320కి విక్రయిస్తున్నారు. వారం కిందట రూ.240 నుంచి రూ.260 వరకు ధర ఉన్నది. గతంలో ఎప్పుడైనా చికెన్‌ ధర పెరిగినా రూ.280 వరకు వచ్చి, మళ్లీ తగ్గేది. ఇప్పుడు 300 మార్కును దాటడంతో చికెన్‌ సేల్స్‌ ఒక్కసారిగా పడిపోయాయి. చికెన్‌ సెంటర్లకు వచ్చినవారు రేట్‌ చూసి వెనక్కి పోతున్నారు. దాంతో కొనుగోలుదారులు లేక చికెన్‌ సెంటర్లు వెలవెలబోతున్నాయి. పెళ్ళిళ్ల సీజన్‌, వేసవికాలంతో కోళ్ల సప్లయ్‌ పూర్తిగా తగ్గడం చికెన్‌ సెంటర్లకు కోళ్ళను సరఫరా చేసేవారు కొరత కారణంగా సగానికి తగ్గించారు. ధర రోజూ రూ.10 పెరుగుతూ పోతుంది. ధరలు ఈ నెలంతా ఇదేరకంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కొన్నిప్రాంతాల్లో చికెన్‌ ధర స్కిన్‌లెస్‌ రూ.300, స్కిన్‌తో రూ.270గా ధరలు ఉన్నాయి. బాయిలర్‌ కోళ్లు(బతికినవి) కిలో రూ.125, నాటు కోళ్లు రూ.370గా ధర పలుకుతున్నాయి. వంద కోడి గుడ్లను హోల్‌సెల్‌గా రూ.600కు విక్రయి స్తున్నారు. ఒక గుడ్డును రూ.ఆరుకు అమ్ముతు న్నారు. చికెన్‌, గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతూ వున్నారు. పెరిగిన ధరలు తగ్గేలా చూడాలి.గతంలో ఎన్నడూ లేనివిధంగా చికెన్ ధరలు పెరగడం తో శుభ కార్యాల్లో చికెన్ బిర్యాని చేసేవారు వామ్మో అంటూ తక్కువ చికెన్ కొలుగోలు.చేసి పెళ్లిళ్ల తంతు వెళ్ళ దీస్తున్నారు..

  • కామిడి సతీశ్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .
    తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
    9848445134.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు