- కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు..
- అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్..
- దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం..
- ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది..
- ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికలు స్కెచ్..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో విపరీత ప్రభావం చూపుతోంది.. ఎవరూ ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు వ్యూహాలు రచిస్తుండగా.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక్కడుగు ముందుకువేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టడంలో తనదైన శైలిలో సాగిపోతోంది.. దీనికి కారణం కర్ణాటకలో ఆ పార్టీ చిరస్మరణీయ విజయం సాధించి అధికార పగ్గాలు చెప్పటమే అన్నది నిర్విదాంశం.. ఈ విజయంతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ కీలెరిగి వాతపెట్టాలి అన్న రీతిలో ప్రత్యర్థుల ఊహలకు అందకుండా చాపకింద నీరులా తనపని తాను చేసుకుని పోతోంది..
ఈ కోవలోనే భాగంగా.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు బీ.ఆర్.ఎస్., బీజేపీ పార్టీలనుండి 15 మంది నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యేలు, నాయకులతో బాటు ఒక మంత్రి కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.. ఒక పొలిటికల్ కన్సల్టెంట్ ద్వారా ఈ భారీ చేరికలు జరుగనున్నట్లు సమాచారం.. ఒకవేళ ఇదే గనుక జరిగితే రేపు జరుగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపడితే.. ఒక బీసీ ని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..