Sunday, September 8, 2024
spot_img

ఆసక్తికరంగా సీఎం కప్‌..

తప్పక చదవండి

రాష్ట్ర ప్రభుత్వం సాట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్‌-2023 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పతకాలే లక్ష్యంగా దూసుకెళుతూ క్రీడాభిమానులను అలరిస్తున్నారు. నగరంలోని ఆరు స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో పతకాలు కొల్లగొట్టేందుకు పట్టుదల కనబరుస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకుంటూ సత్తాచాటాలన్న కసి ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇదో నూతన అధ్యాయమని పేర్కొన్న సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ పతక విజేతలను అభినందించారు. నేడు జరిగే టోర్నీ ముగింపు వేడుకల్లో పతకాలతో పాటు నగదు పురస్కారాలు అందించనున్నారు. సీఎం కప్‌-2023 టోర్నీలో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మండల, జిల్లా స్థాయి టోర్నీల్లో సత్తాచాటి రాష్ట్ర స్థాయిలో తలపడుతున్న ప్లేయర్లు పతకాలు కైవసం చేసుకునేందుకు కడదాకా పోరాడుతున్నారు. నగరంలోని ఆరు ప్రధాన స్టేడియాల్లో ఆయా క్రీడాంశాల్లో ప్లేయర్ల ప్రదర్శన అదుర్స్‌ అనిపిస్తున్నది. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ సత్తాచాటాలన్న పట్టుదల గ్రామీణ ప్రాంత ప్లేయర్లలో కసిగా కనిపిస్తున్నది. మంగళవారం వేర్వేరు స్టేడియాల్లో జరిగిన పోటీలు అందరనీ ఆకట్టుకున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు