Tuesday, May 28, 2024

9 ఏండ్ల మోడీ పాలనలో దళితులకు పెద్దపీట : కొప్పుబాష

తప్పక చదవండి

బీజేపీ యస్సిమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుబాష ఆదివారం రోజు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 మంది ఎస్సీ ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి ఎస్సీ సమాజాన్ని అధికారంలో భాగస్వామ్యం చేసిందన్నారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతి స్థలాలను పంచ తీర్థ క్షేత్రాలుగా అభివృద్ధి చేసి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వారి జీవిత సందేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉన్నదన్నారు.. 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్కు అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి మనసు రాలేదు తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీలను మంత్రివర్గంలో సమచిత స్థానం కల్పించలేదన్నారు. ఎస్సీలను వ్యాపారవేత్తలుగా చేసే లక్ష్యాలతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్టాండఫ్ ఇండియా పథకం ద్వారా 31 12 2022 నాటికి తెలంగాణలో 472 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేసి 1823 మంది ఎస్సీలను దిగ్గజ వ్యాపారవేత్తలను చేసిందన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి ఎస్సీల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముద్ర యోజన పథకం ద్వారా 30-12-2022 నాటికి 209.65 కోట్ల రూపాయల ముద్ర రుణాలు అందించి 12,466 మంది ఎస్సీ యువకులను వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. మోడీ ప్రభుత్వం 2017 లో నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించి మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పై తనకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని అయితే తెలంగాణలో కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో మాత్రం ఎస్సీలపై వివక్ష ధోరణి ఉట్టిపడిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లను, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పథకాన్ని నీరుగార్చి కేసిఆర్ ఆర్భాటంగా ప్రారంభించిన దళిత బంధు పథకానికి నిధులు,విధానాలు లేక విలవిలబోతుందని అన్నారు. దళిత బంధు పథకంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యేలు ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారో వారి పేర్లు తన దగ్గర ఉన్నాయని స్వయంగా ప్రకటించిన కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేల లిస్ట్ను ఇప్పటికీ ఎందుకు బయట పెట్టలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో నేటికీ 18 లక్షల దళిత కుటుంబాలలో ఇంకా సుమారు 11 లక్షల కుటుంబాలు అంగుళం భూము లేకుండా దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయని మూడు ఎకరాల భూమి ఇస్తే ఎస్సీలు సమాజంలో గౌరవం పొందుతారని ఎస్సీలను అగౌరపరచాలనే ఉద్దేశంతో కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని అంతం చేశారన్నారు. ఎస్సీలకు ఇవ్వడానికి ప్రభుత్వ భూములు లేవని కుంటి సాకులు చెప్పిన కేసీఆర్ నేడు రియలేస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రం భూములులేక్కడివన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణలో ఎస్సీ కార్పొరేషన్ నుండి ఒక్క లోను కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే మోడీ పాలనకు కేసీఆర్ పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందని అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ప్రతి దళిత కుటుంబాన్ని మేల్కొలుపుతూ మోడీ సుపరిపాలన, కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాలు తెలియచేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాంతికిరన్, ఉపాధ్యక్షులు గుటూరు అంబేడ్కర్,గడ్డల అంజిబాబు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు