Tuesday, April 30, 2024

భద్రాచలంలో ప్రమాద హెచ్చరిక..

తప్పక చదవండి
  • వరద నీటితో పొంగి పొర్లుతున్న గోదావరి..
  • అప్రమత్తమైన అధికారులు..
    ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. జూలై 20 మధ్యాహ్నం 3గం. సమయంలో నీటిమట్టం 43 చేరుకుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు మెదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇదిలా ఉండగా భద్రాచలం వద్ద గోదావరిలో ప్రస్తుతం 9.55 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా జూలై మాసంలో గోదావరి ప్రవాహం ఇప్పటి వరకు పదకొండు సార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటింది. ఇందులో ఐదు సార్లు తుది ప్రమాద హెచ్చరికను (52 అడుగులు) సైతం దాటడం గమనార్హం. 1972 జూలై 6న 44.3 అడుగుల గోదావరి నీటిమట్టం నమోదు అయ్యింది.

1976 జూలై 22న 63.9 అడుగులు. 1988 జూలై 2954.. 2003 జూలై 27న 45.8.. 2008 జూలై 6న 47,3.. 2013 జూలై 19న 57, 2013 జూలై 24 56.7..2016 జూలై 12న 52.4..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు