Friday, May 3, 2024

బ్యూటీపార్లర్స్‌పై నిషేధం విధించిన తాలిబన్‌లు..

తప్పక చదవండి
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు..

ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై తాలిబన్‌ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మహిళలను ఇళ్లకే పరిమితం చేసేలా, వారిని ఇళ్ల నుంచి బయటికి వెళ్లనీయకుండా కొత్తకొత్త నిబంధనలను తీసుకొస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా బ్యూటీపార్లర్‌లపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్‌లు కొత్తగా మరో ఫర్మానా జారీచేశారు. ఆఫ్ఘాన్ సర్కారు తీరుపై ఆ దేశంలోని మహిళా లోకం మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌లో మహిళలు ఆందోళనకు దిగారు. తాలిబన్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో భద్రతాబలగాలు రంగంలోకి దిగారు. గాల్లోకి కాల్పులు జరిపి, భాష్పవాయు గోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.

కాగా, ఆఫ్ఘన్‌ సర్కారు ఇప్పటికే తమ దేశంలోని మహిళలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీచేసింది. అంతేగాక పార్కుల్లో మహిళలకు ప్రవేశంపై నిషేధం విధించింది. అదేవిధంగా వివిధ వినోద కార్యక్రమాల్లో పాల్గొనకుండా కూడా మహిళలను తాలిబన్‌ సర్కారు కట్టడి చేసింది. ఆఫ్ఘన్‌ మహిళలు జిమ్‌లకు వెళ్లడంపై కూడా నిషేధం కొనసాగుతున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు