పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్ట్-K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ లో రీలీజ్ చేయనున్నారు. ఒక భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కామిక్ కాన్‌లో తొలిసారి ఎంట్రీ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది ఈ వేదికపై ఒక తెలుగు సినిమా ప్రమోషన్‌లు స్టార్ట్ చేయబోతుందంటే ప్రభాస్ అభిమానులకే కాదు.. టాలీవుడ్ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు గ్లింప్స్ వచ్చేలోపే మేకర్స్ డార్లింగ్ అభిమానులను ఖుషీ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ లు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి మూవీటీమ్ వరుస సర్ ప్రైజ్ లు ఇస్తోంది. మొన్న దీపికా పదుకొణె పోస్టర్ ను రిలీజ్ చేయగా.. నేడు ప్రభాస్ లుక్ ను పరిచయం చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ అంతా అమెరికా బయలు దేరి వెళ్లారు. ప్రభాస్, రానా, కమల్ హాసన్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అయితే, ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ దీపికా పదుకొణె మాత్రం.. ఈ ఈవెంట్ కు హాజరు కావట్లేదు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. ప్రస్తుతం హాలీవుడ్ లో సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. షూటింగ్స్ అన్నింటినీ మధ్యలోనే నిలిపివేసి.. ధర్నాలు చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగానే దీపిక ప్రాజెక్ట్-K కామిక్ కాన్ ఈవెంట్ కు దూరంగా ఉంటున్నారు.
హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్-అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతోంది. ఈ ఫెడరేషన్ లో దీపికా కూడా ఓ సభ్యురాలే. హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్-అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ లో ని సభ్యులంతా ఎటువంటి షూటింగ్స్ లోనూ, అలాగే సినిమాకు సంబంధించిన ఎటువంటి ప్రమోషన్స్, ఈవెంట్స్ లోనూ పాల్గొనకూడదు. అందుకే హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్-అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ కు మద్దతుగా ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ కోసం.. శాన్ డీగో కామిక్ ఈవెంట్ కు దీపిక దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని సినీ పరిశ్రమ వర్గాలు తెలిపినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఈ సమ్మెకు.. బాలీవుడ్ భామ, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడా మద్దతు తెలుపుతోంది. దీపిక 2017లో హాలీవుడ్ స్టార్ నటుడు విన్ డీజిల్‌తో కలిసి ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమా ద్వారా హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే ఈ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఫెడరేషన్ లో సభ్యురాలిగా చేరింది. ఇక ప్రాజెక్ట్ K లో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నా.. షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉండటంతో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.