Wednesday, June 19, 2024

వెనుకబడిన కులాల ( బి.సి )లలో వృత్తి చేసుకునే వారికి,చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష సాయం పథకం చారిత్రాత్మకం

తప్పక చదవండి

( జూన్ 9 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రారంభించనున్న బి.సి.లకు లక్ష సాయం సందర్భంగా…..)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వెనుకబడి కులాల ( బి.సి ) లకు వృత్తి చేసుకునే వారికి చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తర తరాలుగా వెనుక బడిన కులాలు ( బి.సి ) లు ఆర్థికంగా, విద్యాపరంగా , సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు.దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినా ఇంకా వెనుకబడిన కులాలు ( బి.సి ) ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వెనుకబడిన కులాల ( బి.సి )లను ఆర్ధికంగా ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన, ఎంతో అవసరమైన, ఆవశ్యకత కలిగిన వెనుకబడిన కులాల ( బి.సి )లకు వృత్తి చేసుకునే వారికి చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష రూపాయల సాయం పథకం అమలు చేయడం ఎంతో అభినందించదగిన విషయం.చారిత్రాత్మకం.
వెనుకబడిన కులాల ( బి.సి ) లోని వృత్తి చేసుకునే వారికి చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కులాలను ప్రధానంగా ఎంపిక చేసింది.వెనుక బడిన కులాలు (బి.సి) లోని కులాలు 1. నాయి బ్రాహ్మణ 2.రజక 3.సాగర,ఉప్పర 4.కుమ్మరి,సాలివాహన 5.అవుసుల 6.కంసలి 7.కమ్మరి 8.కంచరి 9.వడ్ల,వడ్ర, వడ్రంగి, మరియు శిల్పులు 10.కృష్ణ బలిజ,పూసల 11.మేదర 12.వడ్డెర,13. ఆరె కటిక 14.మేరా 15.ఎం.బి.సి.అర్హులు.ఇంతకు ముందు కళ్యాణ లక్ష్మి తీసుకున్న లబ్ధి దారులు కూడా బి.సి.లకు లక్ష సాయం పథకంకు అర్హులేనని తెలిపింది.తెల్ల రేషన్ కార్డులు కలిగి 2120 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న ఆధాయ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ లోని 33 జిల్లాల ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ప్రతినెల 15 వ తేదీన చెక్కుల పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీష్ రావు, వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్,బి.సి.సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేష్ తదితరులు ప్రకటించారు.జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వారిలో నుండి అర్హులైన వారికి ఎంపిక చేస్తామని తెలిపారు.
బి.సి.లలో అనేక కులాలు దాదాపు 120 కులాల వరకు ఉంటే 15 కులాల బి.సి.కుల వృత్తుల,చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష సాయం పథకం ప్రకటించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
బి.సి.కుల వృత్తుల చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష సాయం పథకం కింద కొన్ని కులాలను మాత్రమే పేర్కొన్నారు.తెలంగాణ ఆరె కటిక ట్రస్ట్ నాయకులు, మిగతా మన కుల పెద్దలు తెలంగాణ రాష్ట్ర మంత్రులను కలిసి ఆరెకటికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆరె కటికల కుల వృత్తి మాంసం దుకాణాలు మూసి వేసి తెలంగాణ ఉద్యమంలో, పోరాటం లో చురుకుగా పనిచేసి జైళ్ళకు వెళ్ళడం,కేసులు నమోదు కావడం జరిగింది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నా ఆరె కటికలకు నామినేటెడ్ పదవులు ఏమి ఇవ్వలేదు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆరె కటికలకు రాజ్యాధికారం లో అవకాశం లభిస్తుందని కన్న కలలు అన్నీ కలలు మాదిరిగానే మిగిలాయి.
బి.సి కుల వృత్తుల వారికి చేతి వారికి ఇంటికి లక్ష సాయం పథకం కింద లభించిన లబ్దిదారులు సక్రమంగా ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి.

ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించాలి:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాయితీలు, సబ్సిడీలు ప్రజలు కోరుకోవడం లేదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు, సబ్సిడీలు చాలామందికి అందడం లేదు.ప్రజలు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలని అంటున్నారు.
విద్య, వైద్యం, న్యాయం కోసం లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో వసూలు చేసి ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రయివేటు, కాన్వెంట్, పబ్లిక్, రెసిడెన్షియల్ స్కూల్ లు, నవోదయ స్కూల్ లు అంటూ ఫీజులు లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు.ఫీజులపై ఎలాంటి అజమాయిషీ లేదు. ప్రయివేటు, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులంటూ చిన్న రోగమైన బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, కరోనా టెస్ట్, యూరిన్ టెస్ట్, అంటూ లక్షలకు లక్షలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు.చనిపోయిన శవం కు కూడా మూడు లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన హెల్ట్ కార్డులు దేనికి పనికి రాకుండా పోతున్నాయి.ఉద్యోగస్తులు ప్రతి నెలా ఇంటి ఖర్చులు పోగా దాచుకున్న సొమ్ము చిన్న పాటి రోగానికే ఖర్చు చేయాల్సి వస్తుంది.వడ్డీలకు వడ్డీలు అప్పులు చేసి చికిత్స తీసుకుంటున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఎలాంటి పథకాలు, రాయితీలు, సబ్సిడీలు ప్రవేశ పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఉండదు

- Advertisement -

బి.సి.లకు బి.సి.బంధు కావాలి.బి.సి లలో కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష సాయం పథకం అవసరం లేదు:-
బి.సి.లకు బి.సి.బంధు ప్రవేశ పెట్టి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని బి.సి.ల లో కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి ఇంటికి లక్ష సాయం పథకం అవసరం లేదని అనేక బి.సి.సంఘాలు కోరుతున్నారు.80 శాతం ఉన్న బి.సి లు అనేక కులాలు ఆర్ధికంగా, విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వారికి బి.సి.బంధు ద్వారా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం పెంపొందించాలని కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఆరెకటికలకు నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేయాలని ఇప్పటి వరకు ఏ ఒక్కరికి అవకాశం రాలేదని వారు తెలిపారు.

  • డాక్టర్. ఎస్. విజయ భాస్కర్,
    తెలంగాణ ఆరె కటిక ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు, మీడియా కార్యదర్శి.,
    అఖిల భారత ఖటిక్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.,
    9290826988
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు