Tuesday, June 25, 2024

ఉద్యోగుల‌కు గూగుల్ వార్నింగ్‌..

తప్పక చదవండి

హైబ్రిడ్ వ‌ర్క్ మోడ‌ల్‌ను అనుస‌రించ‌ని ఉద్యోగుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సెర్చింజ‌న్ దిగ్గ‌జం గూగుల్ విస్ప‌ష్ట సంకేతాలు పంపింది. వారానికి క‌నీసం మూడు రోజుల పాటు కార్యాల‌యాల నుంచి ప‌నిచేయాలని, రిట‌న్ టూ ఆఫీస్ పాల‌సీకి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే ఉద్యోగులు పేల‌వమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతార‌ని హెచ్చ‌రించింది. పెర్ఫామెన్స్ రివ్యూ సంద‌ర్భంగా ఉద్యోగుల హాజ‌రును త‌నిఖీ చేస్తామ‌ని తేల్చిచెప్పింది. గూగుల్ కార్యాల‌యాల‌కు ఉద్యోగులు విధిగా రావాల‌ని, రిమోట్ వ‌ర్క‌ర్లు హైబ్రిడ్ వ‌ర్క్ షెడ్యూల్ అనుస‌రించాల‌ని, బృందంగా ప‌నిచేస్తే మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీస‌ర్ ఫియాన సిసోని పేర్కొన్నారు.

అమెరికాలో బ్యాడ్జ్ డేటా ఆధారంగా కార్యాల‌యాల‌కు ఉద్యోగుల హాజ‌రును గూగుల్ ప‌ర్య‌వేక్షించ‌నుండ‌గా, ఇత‌ర దేశాల్లోనూ ఈ దిశ‌గా సెర్చింజ‌న్ దిగ్గ‌జం క‌స‌ర‌త్తు సాగిస్తోంది. హైబ్రిడ్ మోడ‌ల్ పాల‌సీని వ‌రుస‌గా ఉల్లంఘిస్తున్న ఉద్యోగుల‌తో హెచ్ఆర్ వ‌ర్గాలు మాట్లాడి త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు సిద్ధం కానున్నాయి. మైక్రోసాఫ్ట్‌, ఓపెన్ఏఐ వంటి ప్ర‌త్య‌ర్ధుల నుంచి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పోటీ ఎదుర‌వుతున్న స‌మ‌యంలో వ‌ర్క్ ఫ్రం ఆఫీస్ పాల‌సీకి క‌ట్టుబ‌డాల‌ని ఉద్యోగుల‌పై గూగుల్ ఒత్తిడి పెంచుతుండ‌టం గ‌మ‌నార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు