Friday, October 11, 2024
spot_img

‘కులగణన’ కేంద్రమే చేయాలి.. సిఫారసు చేయండి

తప్పక చదవండి
  • జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ ను కలిసి
    కోరిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం
  • తెలంగాణ బీసీ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం..
  • దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సిఫారసు చేయండి.
  • బీహార్ – ‘పాట్నా హైకోర్టు’ కులసర్వేను కూడా నిలుపుదల చేసింది..
  • సుప్రీo సూచించిన “త్రిబుల్ టెస్ట్” ల పూర్తికి కేంద్రమే “కులగణన” చేపట్టాలి..
  • ఓబీసీ జాబితా వర్గీకరణలో జాప్యం నివారించి, జస్టిస్ రోహిణి కమిషన్
    నుండి త్వరితగతిన నివేదిక తెప్పించి.. వర్గీకరణను అమల్లోకి తీసుకురండి..

న్యూ ఢిల్లీ, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో అమలులో ఉన్న బీసీ రిజర్వేషన్ల శాతం, జాబితాల పునర్విభజన, మార్పులు, చేర్పులను శాస్త్రీయంగా నిర్ణయించడానికి తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘ కులగణన’ చేపట్టాలని కోరుతూ జాతీయ బీసీ కమిషన్ సిఫారసు చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు కోరారు.

గురువారంనాడు న్యూఢిల్లీలో బికాజీ కామ ప్లేస్, త్రికూట్-1 లో గల జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ తో డా: వకుళాభరణం ప్రత్యేకంగా భేటి అయ్యారు. పలు అంశాల వారిగా కూలంకశంగా చర్చించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందచేశారు. తొలిసారిగా కలిసిన ఈ నేపథ్యంలో ఇరువురు ఛైర్మన్లు ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. పుష్పగుచ్ఛాలు అందచేసుకున్నారు. శాలువాలతో సత్కరించుకున్నారు.

- Advertisement -

ఈ ప్రత్యేక భేటి సందర్భంగా… జాతీయ ఛైర్మన్ తో చర్చించిన అంశాలు :
(1) కేంద్రం ప్రత్యేకంగా ‘కులగణన’ చేపట్టాలి. ‘కులగణన’ చేపట్టడం వలన ప్రధానంగా ‘బీసీ’ ల అభ్యున్నతికి పకడ్బందీగా చర్యలు తీసుకోవడానికి వీలుకల్గుతుంది. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ల అమలులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల అమలుకు, రిజర్వేషన్ల శాతo స్థిరీకరణకు ఉన్న అవరోధాలకు, అడ్డంకులకు నివారణ లభిస్తుంది. ‘కులగణన’ కై కేంద్రానికి సిఫారసు చేయండి.

(2) దేశవ్యాప్తంగా బీసీలకు ఎలాంటి పథకాలు అమలలో లేవు. దేశానికి సంక్షేమ పథకాల అమలులో ‘రోల్ మోడల్’ తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ మహాత్మా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు, విదేశి విద్యా నిధి (Overseas Scholarship), రియంబర్స్ మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బోధనా రుసుం పథకం, ఈఎంఐ లతో నిమిత్తం లేని ఆర్థిక చేయూత, కళ్యాణ లక్ష్మి మున్నగునవి. ఇలాంటి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం కు సిఫారసు చేయండి.

(3) 2023-24 కేంద్ర వార్షిక బడ్జెట్ లో 56 శాతం జనాభా కలిగిన ఓబీసీలకు కేంద్రం కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులు ఏ మేరకు సరిపోవు. 2 లక్షల కోట్ల నిధులు కేటాయించేలా సిఫారసు చేయండి.

(4) కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు అనివార్యమైనది. ఈ దిశగా చర్యలకు కేంద్రంకు నివేదించండి.

(5) కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాలలో 27శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలుకు ‘బ్యాక్ లాగ్’ విధానాన్ని ఓబీసీ లకు కూడా వర్తించేలా సిఫారసు చేయండి.

(6) రాష్ట్ర బీసీ జాబితాలో నమోదై విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు పొందుతున్న బీసీ కులాలను, కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చడానికి సిఫారసు చేయండి. ఇప్పటికే ఈ సామాజిక వర్గాల ప్రజలు ఉన్నతమైన అవకాశాలు కోల్పోతున్నారు.

(7) నాన్ క్రీమీ లేయర్ పరిధిని 8 లక్షలుగా నిర్ణయించి 6 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ సమీక్షించలేదు. ఈ నేపధ్యంలో వెంటనే సమీక్షించి ఆదాయ పరిమితి విధింపును రూ. 15 లక్షలకు పెంపుదల చేసేలా కేంద్రానికి సిఫారసు చేయండి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు