Saturday, June 15, 2024

9 ఏళ్ల మోడీ పాలనలో అభివృద్ధి అమోఘం..

తప్పక చదవండి
  • నిజామాబాద్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్..
  • తొమ్మిదేళ్ల మోడీ పాలనపై ప్రజెంటేషన్..
  • .భారత దేశంలో అన్నీ వర్గాలను గౌరవిస్తూ పాలన అందించాం..
  • కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనటంతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా నిలిచాం.
  • ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు..

హైదరాబాద్ : 9 ఏళ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జూన్ 4వ తేదీ ఆదివారం ఆయన నిజామాబాద్ లో పార్లమెంట్ జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనపై వీడియో ప్రజెంటెషన్ ఇచ్చారు అర్వింద్. ముందుగా ఒడిశా ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాట్లాడిన అర్వింద్.. “9 ఏళ్ల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదు. పేదలకు సేవా, అవినీతి రహిత పాలన అందించాం..భారత దేశంలో అన్నీ వర్గాలను గౌరవిస్తూ పాలన అందించాం..ప్రపంచంలోనే అతి పెద్ద ఫుడ్ కంట్రీ ఇండియా. కోవిడ్ ను ఎదుర్కొన్న తీరు ప్రపంచంలోనే గొప్ప విషయం. కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనటంతో ప్రపంచ దేశాల్లో మనం అగ్రగామిగా నిలిచాం. అమెరికా కన్నా అత్యంత వేగంగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాము. ఇప్పటి వరకు 100 దేశాలకు వాక్సిన్ ఎగుమతి చేసాం.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3.50 కోట్ల ఇల్లు నిర్మించాము. మహిళల ఆత్మ గౌరవం కోసం 11.72 కోట్ల టాయిలెట్స్ నిర్మించాం. 20-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా బాలికలకు చదువుకునే అవకాశం(స్కూల్ ఎన్ రోల్ మెంట్) కల్పించాం. గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం టాయిలెట్స్ కట్టించము.12 కోట్ల గృహాలకు మంచినీటి సరఫరా అందిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మిషన్ భగీరథ పూర్తి కాలేదు. ఉజ్వల యోజన కింద దేశ వ్యాప్తంగా 9.6 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము. కోవిడ్ వచ్చాక 80 కోట్ల మందికి ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 80 వేల మందికి ఉచిత బియ్యం సరఫరా చేశాము. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు మోడీ. కష్టకాలంలో దేశానికి ప్రధానిగా.. మోడీ ఉండటం దేశప్రజల అదృష్టం. ఇప్పటికే 23.3 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ చేశాము.

- Advertisement -

తెలంగాణలో రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకపోవటం వల్ల పేదలు నష్టపోయారు. దేశంలో మహిళలకు ఒక్క రూపాయికే సానిటరీ ప్యాడ్లు అందిస్తున్నాము. రైతులకు ఎరువుల కోరత లేకుండా చేశాం. అధిక సబ్సిడీ ఇస్తూ ఎరువులు అందిస్తున్నాం. ఇక దేశంలో అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్ కల్పించాము. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత మోడీది. హజ్ యాత్రకు వెళ్లే వారికి కనీస ఫీజును తొలగించాము. ఇక దేశ అభివృద్ధిలో భాగంగా 9 ఏళ్లలో 74 కొత్త ఎయిర్ పోర్టులు, 111 జలాంతర మార్గాలను నిర్మించాము. ఇటీవల 20 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించాము. రైల్వే లైన్ల విద్యుధీకరణ వేగవంతం చేశాము. కొత్తగా 15 ఎయిమ్స్ కాలేజ్ లను ఏర్పాటు చేశాం. కాశ్మీర్ లో అత్యంత ఎత్తు మీద చినాబ్ బ్రిడ్జ్ ను నిర్మించాం.

దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాం. దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు ప్రవేశపెట్టిన ఘనత మోడీది. ఆత్మ నిర్బర్ భారత్ కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాం. మొబైల్ ఫోన్ల తయారీ, ఎగుమతి పెంచాం. విదేశీ పెట్టుబడులు పెంచాం..స్టార్ట్ అప్ స్కిం కింద దేశంలో స్వయం ఉపాధి పెంచిన ఘనత మోడీది. యువ శక్తిని పెంపొందించాం.. యువతకు విద్య, ఉపాధి, క్రీడల్లో అవకాశాలు కల్పిస్తున్నాము. దేశంలో ఆలయాల నిర్మాణంతో పాటు, హైందవ ధర్మ రక్షణకు చర్యలు తీసుకుంటున్నాము. అయోధ్యలో రామాలయ నిర్మాణంతో దేశ ప్రజల కల నెరవేర్చాము. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. అడవుల అభివృద్ధి ఘననీయంగా పెంచాం..రూ.890 కోట్ల రూపాయలతో గంగానది ప్రక్షాళన చేపట్టాం.

టూరిజం పెంచాం..జాతీయ భద్రతపై అధిక దృష్టి సారించాం. ఇందులో భాగంగా ఆర్టికల్ 370 రద్దు చేసాం.. ఇవాళ కాశ్మీర్ లో అభివృద్ధి ఊపందుకుంది.. టూరిజం పెరిగింది. దేశంలో టెర్రరిజం తగ్గించాం. ప్రపంచ దేశాలకు ఆయుధాలను సరఫరా చేసే స్థాయికి ఎదిగాం. 85 దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేస్తున్నాము. ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు” అని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు