Sunday, October 13, 2024
spot_img

ఆయుష్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌..

తప్పక చదవండి

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)- ‘ఆలిండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్‌(ఏఐఏపీజీఈటీ) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్‌ కాలేజీల్లో ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎ్‌సఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌/ గ్రేడెడ్‌ బీహెచ్‌ఎంఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అక్టోబరు 31 నాటికి ఏడాది వ్యవధి గల రొటేటింగ్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తయి ఉండాలి.

- Advertisement -

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు : ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. ఇందులో మొత్తం 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం మార్కులు 480. తప్పుగా గుర్తించిన సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఆయుర్వేదం పేపర్‌ను ఇంగ్లీష్‌, హిందీ; హోమియోపతి పేపర్‌ను ఇంగ్లీష్‌; సిద్ధ పేపర్‌ను ఇంగ్లీష్‌, తమిళం; యునానీ పేపర్‌ను ఇంగ్లీష్‌, ఉర్దూ మాధ్యమాల్లో ఇస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.

దరఖాస్తు ఫీజు : జనరల్‌ అభ్యర్థులకు రూ.2700; ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2450; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1800.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 24.. కరక్షన్‌ విండో ఓపెన్‌: జూన్‌ 26 నుంచి 28 వరకు.. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ తేదీ: జూలై 31.. పరీక్ష కేంద్రాలు: అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌.. వెబ్‌సైట్‌: aiapget.nta.ac.in

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు