Friday, March 29, 2024

భారత నౌకాదళంలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన..

తప్పక చదవండి

భారత నౌకాదళంలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన..
ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేస్తారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ఉంటుంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు: అగ్నివీర్‌(సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌- ఎస్‌ఎస్‌ఆర్‌).. ఖాళీలు: 1,365(పురుషులు-1,120, మహిళలు-273).. అర్హత: మేథ్స్‌, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా…కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి… వయసు: 2002 నవంబరు 1 – 2005 ఏప్రిల్‌ 31 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కనిష్ఠ ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ., స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.. ఎంపిక ప్రకియ్ర: షార్ట్‌లిస్టింగ్‌, కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష(పీఎ్‌ఫటీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో నవంబరు నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తరవాత సంబంధిత విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.35,500, నాలుగో ఏడాది రూ.40వేల వేతనం లభిస్తుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లీష్‌ భాషల్లో ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులను కేటాయించారు. ఇంగ్లీష్‌, మేథమెటిక్స్‌, సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన నాలుగు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.550.. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.. ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: మే 29.. ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్‌ 15.. https://www.joinindiannavy.gov.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు