Saturday, May 18, 2024

కేటీఆర్ కనుసన్నలలోనే ప్లాట్ల వేలం..

తప్పక చదవండి
  • ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్..

బినామీ కాంట్రాక్టర్లు, మాఫియా జీవో 111 భూములు, రింగ్ ఫార్మేషన్‌కు దగ్గరగా ఉన్న ప్లాట్ల కోసం వేలం మంత్రి కేటీఆర్ కనుసన్నలలోనే వేస్తున్నారు వేస్తున్నారు అని ఈడీ, సిబిఐలో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. సమాఖ్య ఆంధ్రప్రదేశ్ లో భూములు అమ్మవద్దు అని ధర్నాలు చేసిన కేటీఆర్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, కోకాపేటలో నియో పొలిస్ భూముల్లో రూ. 100 కోట్లు పలికిన ఎకరం భూమి.. పక్కన అనుకోని ఉన్న కల్వకుంట్ల బినామీ 40,000 ఎకరాల భూముల విలువ పెంచడానికే.. కెసిఆర్ కి అత్యంత సన్నిహితుడు, సిద్దిపేట మాజీ కలెక్టర్, ఇప్పుడు ఎమ్ఎల్ సి కి చెందిన రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ కు ప్లాట్ నెం 10, రూ.100.75 కోట్లు ఉంటే మిగిత 450 ఎకరాలకు కూడా 100 కోట్లకు అమ్మాలి కదా.. మరో పక్కన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ రెవెన్యూ పరిధిలోని 283/పీ, 284/పీ, 287/పీ, 288/పీ, 299/పీ, 289 నుంచి 298 వరకు గల సర్వే నెంబర్లలోని 182 ఎకరాలను భారీ లేఅవుట్‌గా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. ఇందులో కేవలం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, డెవలపర్స్‌, పలు సంస్థలకు మాత్రమే అవకాశం కల్పించేలా 14 ప్లాట్లను (ల్యాండ్‌ పార్సిల్‌) మాత్రమే హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు చేశారు. సిబిఐ,ఈడీ కార్యాలయనికి వచ్చినవారిలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, అయిత గిరిబాబు, శశాంక్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు