నేటి సమాజంలో స్వార్ధం, అహంకారం,ఓర్వలేనితనం వెర్రితలలు వేస్తున్న నేపథ్యంలో సిద్దాంతాలు,విలువలు, వ్యక్తిత్వం గల వ్యక్తుల గొంతులు బాహ్య ప్రపంచానికి వినపడాలి. మల్లెలాంటి మనసులు గల వ్యక్తులు జనంలో తమ గళం వినిపించాలి. అంతర్గతమైన సద్గుణాలే మనిషి నిండైన వ్యక్తిత్వానికి సూచికలు. మచ్చుకైనా కనిపించని మంచి గుణాలను ఉన్నట్లుగా బాహ్య ప్రపంచానికి ప్రదర్శించడం వలన వ్యక్తిత్వం మసక బారుతుంది.వ్యక్తిత్వం కొంటే దొరికే వస్తువు కాదు. వ్యక్తిత్వం సాధన ద్వారా సమకూరే సంపద. మన కంటూ ఇహలోకంలో శాశ్వతంగా మిగుల్చుకుని పోయే భౌతిక సంపద అంటూ ఏదీ లేదు. సకల సద్గుణాలే శాశ్వత ఆభరణాలు. భౌతికమైన,అశాశ్వతమైన తుచ్ఛ సంపదల వెంట పరుగెడుతూ, మనశ్శాంతిని కోల్పోవడమే కాకుండా పరుల కు అపకారం తలపెడుతూ, అనునిత్యం కలహ భోజన ప్రియత్వం తో పైశాచిక ఆనందాన్ని పొందుతూ అదే జీవితమని భ్రమించి, ఛీత్కారాలతో కాకుల్లా బ్రతికేస్తే, జీవితానికి అర్ధమేమిటి? పరమా ర్ధమేమిటి? విధి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తుందని నమ్మే వారు కూడా తమ ఆత్మతృప్తి కోసం ఇతరులను మానసి కంగా గాయ పరచడం, అహంతో చెలరేగి పోవడం మానసిక దౌర్భర్యం. ఒక వైపు తీవ్రమైన దైవ చింతన, మరో వైపు పర హింస, ద్రోహచిం తన వంటి భావాలను దైవం మెచ్చునా? మనంచేసే ప్రతీ కార్యం చిత్తశుద్దితో, ఆత్మ ప్రబోధానుసారం జరగాలి. మెదడులో జనించే ఆలోచనలు హృదయం వరకు వచ్చే సరికి, మంచి, చెడుల అంత ర్మధనం జరుగుతుంది. చెడు వలదని ఆత్మ ప్రబోధి స్తున్నా, చెడు వైపే దృష్టి సారించడం దైవ ద్రోహమే. అంతరాత్మ అంగీకారమే దైవం మెచ్చిన సత్కారం. ఈ నిజాన్ని దాచి, అంతరా త్మకు విరు ద్ధంగా ప్రవర్తించడం మానవ బలహీనత. మానవుడు తన బల హీనతలను జయించిన నాడు మహనీయుడు కాగలడు. అయితే చంచల స్వభావం గల మనిషిలో సకల సద్గుణ సంపద ను అన్వే షించడం, సంపూర్ణమహనీయతను ఆశించడం అత్యాశే కాగలదు. కాబట్టి కనీస మానవీయతను సంతరించు కోవడానికి కనీస ప్రయత్నం జరగాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యా లను త్యజించాలని ఆశించడం చెప్పడం ఆశ్చర్యం, అతిశయోక్తి. దుర్జన గుణాలను కనీసస్థాయికి తగ్గించుకుని, మనిషిగా బ్రతకడ మే ఉత్తమోత్తమం. విధిఆడే వింతనాటకంలో పావులుగా మారడం సహజమేమో. కాని విధిని సైతంధిక్కరించి,ఇతరుల మనోవేదనకు కారణమైన వారంతా ఈభువిపై శాశ్వతంగా మిగిలిపోరు. వారం తా ఏదో ఒకరోజు కాలగర్భంలో కలసి పోక తప్పదు. చర్యకు ప్రతిచర్య ఉంటుం దనేది శాస్త్రసమ్మతం. మనం చేసే ప్రతీ పనికి మంచి చెడుల ఆధారంగా ప్రతి చర్యలుంటాయి. దుష్కృత్యా లకు ఫలితం తప్పదు. ఇది ఒక తరానికే పరిమితం కాదు. కొన్ని తరాల కు శాపంగా మారుతుం దనే సత్యం చరిత్ర చెబుతున్నది. మనిషి ఎంతకాలం జీవించా మన్నది కాదు,ఎంత గౌరవంగా జీవించామ న్నదే ప్రధానం. నేటి సమాజంలో ఒకరిని మరొకరు పీక్కుతినే పరిస్థితు లు ఏర్పడు తున్నాయి.అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ఒకరి ఆవేదనకు మరెందరో కారణం కావడం ఎంతవరకు సబబు? ఇతరుల జీవి తాలనుశాసిస్తూ, హింసిస్తూ, వారి ఆవేదనకు కార ణం కావడం అత్యంత పైశాచికం. ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎందుకు జన్మించాము? జన్మించి చేస్తున్నదే మిటి? మనుషులు మారాలి. మారిన మనుషులు ఎవరినీ ఉద్దరించనవ సరం లేదు. ఎవరి బ్రతుకును వారు బ్రతికి, ఇతరులను కూడా బ్రతకనిచ్చే మానసిక ఉచ్ఛస్థితి మనలో కలగాలి. పశ్చాత్తా పంతో మారడం ఒక ఎత్తయితే, వైరాగ్యంతో మారడం మరొక అంశం. మొదటి మార్గమే శ్రేయ స్కరం. మానవ తప్పిదాలవలన సకల జీవరాశులు మహాప్రళయం అంచున నిలబడి ఉన్నాయి. ఇకనైనా మన తప్పిదా లకు, ఘోరకృత్యాలకు విముక్తిలేదా? సకలా చరాచర జగత్తును విధ్వంసం చేసి, మానవుడు సాధించేదేమిటి? అనంత కోటి జీవరా శుల మనుగడ ప్రస్తుతం మానవ విచక్షణపై ఆధారపడి ఉంది. మన గమ్యం మంచి వైపే సాగాలి.సకల జగతి హర్షించాలి. సన్మార్గంలో పయనిస్తూ, వ్యక్తిత్వంతో కూడిన గౌరవ ప్రదమైన జీవ నం సర్వదా శ్రేయస్కరం.వంచన పరిత్యజించాలి. పరుష వాక్కు లు, ఢాంబికం, అహం,స్వార్ధం, అవినీతి,హింసవంటి లక్షణాలను విడనాడాలి. పుట్టి జనం మెచ్చేవిధంగా జీవించాలి. ఇతరులను దూషిస్తూ నిందావాక్యాలను ప్రయోగిస్తూ, జీవించడం దారుణం. ఈదమన ప్రక్రియదహించబడాలి. స్వార్ధంకోసం హింసించి, ఇతర వ్యక్తుల సచ్ఛీలతను శంకించి, చెడుగా చిత్రీకరించి, అపఖ్యాతి పాలు చేయడం అత్యంత క్రూర, పాపనేర ప్రవృత్తి. దైవం మెచ్చని పాప కార్యాలకు ఉత్ప్రే రకంగా మారడం నీచా తినీచమైన ఉన్మాద క్రీడలో ఒక భాగం. మంచి తనంతో జీవించి, ధర్మా న్ని రక్షించి, సత్య మనే సురక్షిత స్థానం పై నిలబడాలి. అప్పుడే మానవాళి మనుగడ సాగించ గలదు. మారడమా? లేదా? అనేది మన విచక్షణపై ఆధార పడి ఉంటుంది. శిఖరంపై కూర్చున్నం త మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. లేని గుణాలను ఆపాదించు కున్నంత మాత్రాన గౌరవం లభించదు. ఎవరి కోసమో మనం జీవించనక్క రలేదు. సాధ్యమైనంతసన్మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. మురికి కూపంలో కూర్చుని మోక్షమార్గం పొందాలను కోవడం మూర్కత్వం పరులను ద్వేషిస్తూ, అసూj ూగ్నిలో రగిలి పోయే తత్త్వంనశించాలి. చక్కని పలుకులు గ్రీష్మ తాపాన్ని చల్లార్చే వర్షపు చినుకులు. హృదికి హాయినిచ్చే శీతల సమీరాలు. వాగ్భూ షణం వ్యక్తిత్వానికి వెలుగునిస్తుంది. నేడు నేడు మనం నిర్మించు కున్న వ్యవస్థలను మనమే ధ్వంసం చేసుకుంటున్నాం. మనం కూ ర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. విలువలను ధ్వంసం చేసి, వ్యక్తిత్వ పరంగా పాతాళబిలంలోకి దిగబడి, అంతరిక్షంలో విహరిస్తున్నా మనేభ్రమల్లో జీవించడం విజ్ఞానమా? అజ్ఞానమా? నోటి మాటకు లేని విలువను, మనం సృష్టించిన నోటుకివ్వడం మానవవింత ప్రవర్తనకు పరాకాష్ఠ వ్యక్తిత్వం మన వ్యక్తిగతమైన అంశమే కావచ్చు, కాని మన వ్యక్తిత్వం వలన సమా జానికి ఎంతో మేలుజరుగుతుంది. గతంలో ఈప్రపంచంలో చోటు చేసుకున్న అస్తవ్యస్తమైన, అసాంఘికమైన పరిస్థితులను మార్చింది కోట్లాది మంది జనం కాదు, ఆ కోట్లాది మంది జనంలో మార్పును తెచ్చిన కొద్దిమంది వ్యక్తుల గొంతుల నుండి జనబాహుళ్యం లోకి జాలు వారిన చైతన్య భరితమైన వాగ్భాణాలు మాత్రమే. వ్యక్తి త్వమున్న వ్యక్తుల సమూహమే. వ్యక్తిత్వం, వెన్నెముకలేని స్వార్ధ శక్తుల వలన సమాజంలో మార్పు అసంభవం. స్వార్ధంలో తడిసి, అవినీతితో మెరుస్తున్న కృత్రిమ గుణాలే నేటి వ్యవస్థలో అధికంగా ఉన్న నేపథ్యంలో నిజమైన వ్యక్తిత్వం గల వ్యక్తుల అన్వేషణ అవసరం.