Thursday, May 16, 2024

గ్రాండ్ గా ఆర్మర్ల్ బేసిక్ కోర్స్ ఇనాగరల్ ఫంక్షన్..

తప్పక చదవండి
  • ముఖ్య అతిధిగా హాజరైన డీజీపీ అంజన్ కుమార్ ఐపీఎస్..

మొదటి బెటాలియన్ యూసుఫ్ గూడ, హైదరాబాద్ లో జరిగినటువంటి రెండవ బ్యాచ్ (33) మంది “ఆర్మరర్ బేసిక్ కోర్సు” కార్యక్రమం ఇనాగరల్ ఫంక్షన్ కి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంజనీ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.. ఈ ఫంక్షన్ లో తెలుగులో ప్రచురించినటువంటి “ఆర్మరర్ బేసిక్ కోర్సు” పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో డీజీపీ (33) మంది ట్రైనీస్ ని వుద్దేశించి మాట్లాడుతూ.. ఆర్మరర్ కోర్సు లో రిపైర్స్ ఎలా చేయాలి, ఇన్స్పెక్షన్స్ ఎలా చేయాలో శ్రద్దగా నేర్చు కోవాలసిందిగా చెప్పడం జరిగింది. ​​ఈ కార్యక్రమం తరువాత యూసుఫ్ గూడలోనే వున్నటువంటి “బేస్ రిపైర్ వర్క్ షాప్ ని డీజీపీ సందర్శించి, పలు రకాల ఆయుధాలు ఎలా రిపైర్ చేస్తారో, వాటికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఆసక్తిగా ఆర్మరర్స్ ని అడిగి తెలుసుకున్నారు. వర్క్ షాప్ లో వున్నటువంటి మెషినరీ, కాంపొనెంట్ సెక్షన్ సందర్శించి వాటి గురించి తెలుసు కోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో డీజీపీతో పాటు, ఏడీజీపీ, టి.ఎస్.ఎస్.పీ. యూనిట్స్ స్వాతి లక్రా ఐపీఎస్, డీఐజీ, టి.ఎస్.ఎస్.పీ. యూనిట్స్ ఎం.ఎస్. సిద్దిఖీ, కమాండెంట్, 1 బెటాలియన్ టి.ఎస్.ఎస్.పీ. పీ. మురళి కృష్ణ, ఇంచార్జి బేస్ రిపేర్ వర్క్ షాప్ పీ. సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు