Saturday, April 20, 2024

అప్పలాయకుంటలో వైభవంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు..

తప్పక చదవండి

తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు.

చిన్నశేష వాహనం దర్శనమివ్వడం పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని, ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుందని అర్చకులు వెల్లడించారు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరమని పేర్కొన్నారు. అదేవిధంగా నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు