Saturday, April 20, 2024

ఎథిక్స్ తప్పినజనగామ జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్..

తప్పక చదవండి
  • అతనిపై చర్యలు తీసుకోవాలంటున్న బాధితుడు పడుగుల దామోదర్..
  • తాను ఏ తప్పూ చేయకుండానే తనపై తన భార్య కంప్లైంట్ ఇచ్చిందని ఆవేదన..
  • రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ నేషనల్
    మెడికల్ కమిషన్ ఆశ్రయించిన బాధితుడు..
  • డా. సుగుణాకర్ రాజు పేరును తెలంగాణ మెడికల్ కౌన్సిల్
    నుంచి 6 నెలలపాటు తొలగించాలని ఆదేశాలు..

ఆయనో బాధ్యత గల డాక్టర్.. జనగామ జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్, లిమ్కా వరల్డ్ బుక్ అవార్డు గ్రహీత డా: సుగుణకర్ రాజు ప్రలోభాలకు లొంగి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంతో ఒక వ్యక్తి జీవితం నాశనం అయ్యింది.. భార్యా భర్తల మధ్య గొడవలు చెలరేగడంతో.. భర్త తనను కడుపులో తన్నడం వల్ల తనకు గర్భ స్రావం అయ్యిందని తెలుపుతూ.. డాక్టర్ సుగుణాకర్ రాజు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ఆధారంగా ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.. ఫిర్యాదుచేసిన మహిళ తండ్రి పోలీస్ అధికారి కావడంతో.. ఫిర్యాదుచేసిన మహిళకు పోలీసులు తక్షణ చర్యలకు దిగడంతో బాధితుడు తన ఉద్యోగాన్ని కోల్పోవడంతో పాటు.. మానసిక క్షోభ అనుభవించడం జరిగింది.. కొడుకుకు జరిగిన అన్యాయం భరించలేక బాధితుడి తండ్రి మరణించడం జరిగింది.. దీనన్నిటికీ డాక్టర్ సుగుణాకర్ రాజు ఇచ్చిన తప్పుడు రిపోర్టు కారణమన్నది నిర్విదాంశం.. భార్యా భర్తల మధ్య గొడవలు అన్నది సహజమే.. వారిద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వవలసిన గౌరవప్రదమైన స్థానంలో ఉన్న డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఒక జీవితం నాశనం కావడానికి కారణం అవడం శోచనీయం..

హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
జనగామ జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, లిమ్కా వరల్డ్ బుక్ అవార్డు గ్రహీత డా: సుగుణకర్ రాజు పేరును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ బుక్ నుండి 6నెలల వరకు తొలగించమని నేషనల్ మెడికల్ కమిషన్ ఏతిక్స్, మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు ఆర్డర్ నెంబర్ 211(2)(89)/2016-ఎథిక్స్ /029428 తేదీ: 29-5-2023 ద్వారా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ను ఆదేశించారు.. వివరాల్లోకి వెళ్తే.. 2011లో గతంలో జనగామ డీఎస్పీగా పనిచేసిన వ్యక్తి కుమార్తెను వివాహం చేసుకున్న పాండుగుల దామోదర్, చెన్నై ఓ.ఎన్.జీ.సి. లో సైంటిస్ట్ గా పనిచేసే వారు.. భార్య భర్తల మధ్య వచ్చిన వివాదంలో తన భర్త కడుపులో తన్నడం వలన గర్భస్రావం అయింది అని తనకు జనగామకు చెందిన డా : సుగుణకర్ రాజు వైద్యం చేసినాడు అని తన తండ్రి పోలీస్ ఆఫీసర్ సహాయంతో వరంగల్ మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది.. డా :సుగుణాకర్ రాజు ఇచ్చిన తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఆధారంగా అతను జైలుకు వెళ్లడం.. ఉద్యోగం నుండి సస్పెండ్ కావడం.. మానసిక క్షోభ తో తన తండ్రి చనిపోయారు అని.. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డా: సుగుణకర్ రాజుపై చర్యలు తీసుకోమని వైద్య విధాన పరిషత్ అధికారులకు ఆంధ్ర /తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారుల కు గత 12సంవత్సరాలనుండి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నాడు ఆ మహిళ భర్త పడుగుల దామోదర్.. డా: సుగుణకర్ రాజు తన డబ్బు, హోదా, రాజకీయ పలుకుబడితో ఆరోగ్య శాఖలోని అధికారులను.. చివరికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులను ప్రలోభపెట్టి.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసిగి వేసారి.. నేషనల్ మెడికల్ కమిషన్ ఢిల్లీని ఆశ్రయించడంతో.. నేషనల్ మెడికల్ కమిషన్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ,
డా: సుగుణకర్ రాజును సంజాయిషీతో పాటు వివరణ కోరినారు.. వారి వివరణ అందిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎత్తిక్స్ కమిటీ ఏర్పాటు చేసినది.. కమిటీ సభ్యులు క్షుణ్ణంగా అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత డా: సుగుణకర్ రాజు తన వైద్య వృత్తి నిర్వహించడంలో అనైతికం గా వ్యవహరించాడు అని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాడు అని తేల్చి, అతని పేరును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నుండి 6నెలల వరకు తొలగించమని ఆర్డర్ ఇచ్చారు.. దీనితో
డా: సుగుణకర్ రాజు 6నెలల వరకు ఎలాంటి మెడికల్ ప్రాక్టీస్ చెయ్యకూడదని, రిజిస్ట్రేషన్ 6నెలల పాటు సస్పెండ్ అయినందున ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది..

- Advertisement -

బాధితుడు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ని ఆశ్రయించిన బాధితుడు పడుగుల దామోదర్ అక్కడ తనకు న్యాయం జరగకపోవడంతో ఢిల్లీ లోని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ని ఆశ్రయించడం జరిగింది.. విచారణ జరిపిన నేషనల్ మెడికల్ కమిషన్ డా. సుగుణాకర్ రాజు తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తేల్చి అతడి పేరును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి ఆరు నెలల పాటు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ దర్యాప్తు అధికారులు సైతం, ప్రలోభాలకు లొంగి తమ విధులను పెడత్రోవ పట్టించారనే విషయం తేటతెల్లమవుతోంది.. ఇది వరకు కూడా పలు సందర్భాల్లో ఆదాబ్ ఆధారాలతో సహా తెలంగాణ రాష్ట్ర మెడికల్ డిపార్ట్మెంట్ లో జరిగిన అవినీతి వ్యవహారాలను వీరి దృష్టికి తీసుని వచ్చినా ఎలాంటి చర్యలకు పాల్పడకపోవడం జరిగింది.. మరి ఇప్పుడు బాధితుడు పడుగుల దామోదర్ వ్యవహారంలో కూడా వారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం గమనార్హం.. తన జీవితాన్ని నాశనం చేయడంలో తమ వంతు పాత్రని పోషించిన డా. సుగుణాకర్ రాజు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ దర్యాప్తు అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుని తనకు తగువిధంగా న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు..

ఇదే విషయంపై డా. సుగుణాకర్ రాజును ఆదాబ్ వివరణ కోరగా.. ఆయన స్పందిస్తూ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. 2014 లోనే సదరు భార్యా భర్తలు విడిపోయారని.. తనపై పడుగుల దామోదర్ చేస్తున్న ఆరోపణలపై, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలపై తాను అప్పీల్ కు వెళ్తానని.. తాను ఏ తప్పూ చేయలేదని తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు