Tuesday, May 21, 2024

అమ్మవార్లకు అధిక మాస వాయినాలు..

తప్పక చదవండి
  • అధిక శ్రావణ మాసం సందర్భంగా కార్యక్రమం..

స్థానిక జనగామ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, శ్రీ నగేశ్వర, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం.. వైశ్య భవన్ లో దేవాలయ పూజారి యల్లంబట్ల ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అధిక శ్రావణ మాసం సందర్భంగా అమ్మవార్లకు అనగా అధికమాస వాయినాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకు 33 రకాలు, శ్రీ పార్వతి అమ్మవారికి 33 రకాలు, శ్రీ సీతాదేవి అమ్మవారికి 33 రకాలు మొత్తం 99 రకాల అధికమాస వాయనాలు ఇవ్వడం జరిగినది.. ఈ కార్యక్రమంలో మొదటగా పెద్ద ఎత్తున మహిళలచే ఊరేగింపుగా దేవాలయానికి చేరుకోవడం జరిగినది.. తదుపరి పారాయణం, అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమలు మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున ప్రారంభించగా.. తదుపరి అమ్మవార్లకు అధిక శ్రావణమాస వాయనాలు ఇవ్వడం జరిగినది.. 33 మంది అమ్మవార్లకు సువాసినీ పూజ చేయడం జరిగినది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పజ్జూరి గోపయ్య స్థానిక మున్సిపల్ కౌన్సిలర్, మహంకాళి హరిశ్చంద్ర గుప్త, ప్రోగ్రాం నిర్వహణ ప్రతినిధులు తడకమల్ల నరసింహారావు, తడక మల్ల సుజాత, అయిత శ్రీనివాస్, పూజారులు అవ్వరు ప్రసాదు, త్రిపురారి ఈశ్వర్, ఆర్యవైశ్య మహిళా సంఘం, వాసవి వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు