Monday, April 29, 2024

పెద్దమనసు చూపించిన అదానీ..

తప్పక చదవండి
  • రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు భరోసా..
  • అనాధలైన పిల్లలకు చదువు ఖర్చు భరిస్తానని ప్రకటన..


గత మూడు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా నిలిచింది ఒడిశా రైలు ప్రమాదం. ఈ దుర్ఘటనలో 277 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది ఈ రైలు ప్రమాదం. ఎంతో మంది తమ వారిని కోల్పోయారు. చిన్నా పెద్దా చాలా మంది చనిపోయారు. గుండెలవిసే రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటింది. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో తన వంతు సాయం చేసేందుకు దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ ముందుకొచ్చారు. ఈ దుర్భర స్థితిలో మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని గౌతమ్‌ అదానీ ప్రకటించారు. వారి చదువుకు అయ్యే ఖర్చునంతా తామే భరిస్తామన్నారు. ఉచితంగా విద్యను అందించి వారికి మంచి భవిష్యత్‌ కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు. ’ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో అందరం తీవ్రంగా కలత చెందాం. ఈ ఘోర దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పాఠశాల విద్యను అందించాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించుకుంది. బాధితులను ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. వారి కుటుంబాలకు, పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించండి’ అంటూ గౌతమ్‌ అదానీ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. ఒడిశా రైల్వే ప్రమాదంపై ఉన్నతాధికారులు కీలక వివరాలు వెల్లడించారు.. ఇప్పటికే రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ’ఎలక్టాన్రిక్‌ ఇంటర్‌లింకింగ్‌ సిస్టమ్‌’లో లోపం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలిపారు. రైల్వే బోర్డ్‌ అధికారులు దీనిపై మరికొన్ని వివరాలు అందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు