Saturday, July 20, 2024

స్పష్టమైన హావిూని ఇవ్వలేకపోయిన అమిత్‌ షా..

తప్పక చదవండి
  • రెజ్లర్లకు దక్కని ఎలాంటి ఊరట..
  • ఆందోళనను విరమించే దిశగా రెజర్ల చర్య
  • ఉద్యమం నుంచి వెనక్కి తప్పుకున్న సాక్షిమాలిక్‌..

న్యూ ఢిల్లీ, 05 జూన్‌ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
హోమంత్రి అమిత్‌ షాను కలిసిన రెజ్లర్లకు నిరాశే మిగిలింది. వారికి అనుకూలంగా ఎలాంటి హావిూ దక్కలేదు. ఇదే విషయాన్ని సోమవారం రెజ్లర్లు వెల్లడించారు.. రెజ్లింగ్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌ వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లు హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. రాత్రి 11 గంటలకు ఢిల్లీ లోని ఆయన ఇంట్లో కలిసిన రెజ్లర్లు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. హోంమంత్రిని కలిసిన వారిలో రెజ్లర్లు భజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ , సంగీతా ఫోగట్‌, సత్యవర్త్‌ కడియన్‌ ఉన్నారు. మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్‌ చేశారు. అయితే హోంమంత్రి అమిత్‌షా వారికి అనుకూలంగా హావిూ ఇవ్వలేదని రెజ్లర్లు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని చెప్పినట్లు రెజ్లర్లు తెలిపారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఇచ్చిన గడువు శనివారం ముగియడంతో హోంమంత్రి అమిత్‌షాతో సమావేశానికి రెజర్లు కోరినట్లు తెలుస్తోంది.

మరోవైపు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ని అరెస్ట్‌ చేయాలని నెల రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలకు ఇక ఫుల్‌స్టాప్‌ పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవే సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్‌ రెజ్లర్‌ తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ ఆందోళనను ఉపసంహరించుకుంది. స్పోర్ట్స్‌ కోటాలో ఆమెకు నార్తర్న్‌ రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఉద్యమం ఉపసంహరించుకుని మళ్లీ డ్యూటీలో చేరిపోయినట్టు సమాచారం. ఆమెతో పాటు మరో రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కూడా విధుల్లో చేరాడు. కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అమిత్‌షాతో జరిగిన చర్చలు అసంపూర్తిగానే మిగిలిపోయాయని, తాము అనుకున్న స్పందన ఆయన నుంచి రాలేదని సాక్షి మాలిక్‌ భర్త ఇప్పటికే వెల్లడించారు.. ఈ సమావేశంలో సాక్షిమాలిక్‌తో పాటు వినేష్‌ ఫోగట్‌, బజ్‌రంగ్‌ పునియా కూడా పాల్గొన్నారు. అయినా…ఇద్దరు రెజ్లర్లు ఒకేసారి ఆందోళనలు ఉపసంహరించుకోవడంపై చర్చ జరుగుతోంది. కాగా.. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌పై నిరసనను పెద్దగా పట్టించుకోలేదని ఆరోపించిన రెజ్లర్లు.. గత నెలలో గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ప్రకటించారు. అయితే రైతుసంఘం నేత నరేష్‌ టికాయత్‌ జోక్యంతో తాత్కాలికంగా విరమించుకున్నారు.అంతకుముందు.. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు పాదయాత్ర ద్వారా నిరసన తెలిపారు. ఢిల్లీ పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఛాంపియన్లు వినేష్‌ ఫోగట్‌, సంగీతా ఫోగట్‌లను పోలీసులు నేలపై పిన్‌ చేసిన దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. అనంతరం జంతర్‌ మంతర్‌లో రెజ్లర్ల నిరసన ప్రదేశాన్ని పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. కాగా.. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మైనర్‌ రెజ్లర్‌ తండ్రి, ఆరుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రిజ్‌ భూషణ్‌పై ఈ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తనపై వస్తున్న ఆరోపణలు స్పందించారు. ఈ కేసులో తాను నార్కో టెస్ట్‌కు కూడా సిద్ధమేనని ప్రకటించారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్‌ మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెజ్లర్లు శనివారం అర్థరాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిశారు. అయితే ఆ విూటింగ్‌ అసంపూర్ణంగా ముగిసినట్లు సాక్షీమాలిక్‌ భర్త సత్యవ్రత్‌ ఖదియాన్‌ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి సరైన రీతిలో స్పందన రాలేదని సత్యవ్రత్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు