Tuesday, September 10, 2024
spot_img

అమెరికా రుణ పరిమితి పెంపు..

తప్పక చదవండి

అమెరికా రుణ పరిమితి పెంపు, ఫెడ్‌ వడ్డీ రేట్ల బాటపై అంచనాలతో గతవారం మార్కెట్‌ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. తుదకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,534 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ అప్‌ట్రెండ్‌కు అవసరమైన పలు సానుకూల సంకేతాలున్నాయని, యూఎస్‌ డెట్‌ సీలింగ్‌ను అక్కడి సెనేట్‌ పెంచడం, ఈ జూన్‌ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌ వేస్తుందన్న అంచనాలు ఏర్పడటం, దేశ వృద్ధి రేటు క్యూ4లో అంచనాలకు మించి పెరగడం వంటివన్నీ ర్యాలీకి దోహదపడే అంశాలేనని విశ్లేషకులు చెపుతున్నారు. అయితే భారత్‌ సూచీల విలువలు అత్యంత ఖరీదైనవికావడంతో గరిష్ఠస్థాయిలో లాభాల స్వీకరణ జరిగే ప్రమాదం ఉంటుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ విజయ్‌కుమార్‌ చెప్పారు. ఈ వారం రిజర్వ్‌బ్యాంక్‌ ద్రవ్య విధాన సమీక్ష, వచ్చేవారంలో జరిగే ఫెడ్‌ కమిటీ మీట్‌ సమీప భవిష్యత్‌ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. వచ్చే కొద్ది ట్రేడింగ్‌ సెషన్లలో నిఫ్టీ 18,887 ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయిని బ్రేక్‌ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని విజయ్‌కుమార్‌ అంచనా వేశారు. గత స్వింగ్‌ హై అయిన 18,459 పాయింట్ల స్థాయి వద్ద లభించే మద్దతు ఈ వారం నిఫ్టీకి కీలకమని, ఈ స్థాయిపైన నిలిస్తే అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ సుభాష్‌ గంగాధరన్‌ చెప్పారు. కానీ 18,459 స్థాయిని కోల్పోతే, కరెక్షన్‌ జరగవచ్చని అంచనా వేశారు. 18,600పైన స్థిరపడగలిగితే రికార్డు స్థాయిని చేరవచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ కునాల్‌ షా తెలిపారు. 18,400 సమీపంలో మద్దతు లభిస్తున్నదని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు