Sunday, July 21, 2024

సీనియర్‌ నటుడు శరత్‌బాబు మృతి

తప్పక చదవండి

హైదరాబాద్ : సీనియర్‌ నటుడు శరత్‌బాబు(71) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతన్న శరత్‌బాబు మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శరత్‌ బాబు గత నెల రోజులగా ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో తుది శ్వాస విడిచారు. వయసు సంబంధ వ్యాధులతో పాటు శరీరం మొత్తం సెప్సిన్ కావడంతో శరీరంలోని చాలా భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు కాలేయం కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు పూర్తి స్థాయిలో పాడయ్యాయి. గత కొన్ని నెలలుగా చెన్నైలో ట్రీట్ మెంట్ తీసుకున్న ఆయనను వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయినప్పటికీ ఆయన అనారోగ్య సమస్యల నుంచి కోలుకోలేక పోయారు. సుమారు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. శరత్ బాబు మరణ వార్తతో యావత్ తెలుగు సినీ రంగం విషాధంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. కాగా శరత్ బాబు పార్థివ దేహాన్ని చెన్నైకి తరలించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ బాబు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1973లో విడుదలైన రామరాజ్యం సినిమా ద్వారా సినీ రంగంలో అడుగు పెట్టారు. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లోనూ నటించారు. దాదాపుగా 250కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు చేసి అందరినీ మెప్పించారు. చివరగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించారు. ఇక అందరినీ వదిలి దివికి ఎగిరి పోయారు.

రీర్‌ మొదట్లో ఏడాదికి పది, పదిహేను సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. ఇక తెలుగులో శరత్‌బాబు చివరగా ‘వకీల్‌సాబ్‌’ సినిమా చేశారు. ఈ సినిమాలో శరత్‌బాబు డిసిప్లైన్‌ కమిటీ చైర్మన్‌ పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘మళ్లీ పెళ్లి’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా శరత్‌బాబు చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా ఈటివీలో 1977లో వచ్చిన ‘అంతరంగాలు’ సీరియల్‌ శరత్‌బాబును బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత ‘జనని’, ‘అగ్నిగుండాలు’ సీరియల్స్‌ కూడా శరత్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు