Friday, July 19, 2024

అబ్రకదబ్రా శ్రీచైతన్య టెక్నో స్కూల్‌ దందాల లీలలు

తప్పక చదవండి
  • అసలు ఏంఈవో ఉన్నట్ల. .లేనట్లా…?
  • ఒకవేళ ఉంటే శ్రీచైతన్య పాఠశాలపై ఆయనకు అంతగా ప్రేమేందుకు..?
  • భారీ విద్యుత్‌ లైన్లు ఒకవైపు..నిర్మాణాలు మరొకవైపు
  • విద్యుత్‌ రేడియేషన్తో చదువు మాట దేవుడెరుగు ఉన్న మతి పోకుంటే సరి అంటున్న పలువురు

శంకర్‌ పల్లి : మున్సిపాలిటీ పరిధిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ అబ్రక దబ్రా అంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి తారాస్థాయికి చేరుకుంటోంది.అనుమతులు లేకుండానే పాఠశా లను కొనసాగిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసమని పలు వురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతూ పాఠశాలను కొనసాగిస్తూ వందల మంది విద్యార్థులను జాయిన్‌ చేసుకుంటూ కొనసాగిస్తూ ఉంటే స్థానిక విద్యాధికారి ఏం చేస్తున్నారని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.ఏంఈవో కు సైతం పిల్లలు ఉన్నారు కదా. ..పాఠశాలలో చదివే పిల్లలు ఆయన పిల్లలు అందరూ సమానమే కదా ..అనుమతులు లేని పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తే గుర్తింపు ఎక్కడ దొరుకుతుంది, శ్రీ చైతన్య అని పేరు ఉంటే చాలా..?అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదా ..?400 పైచిలుకు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విద్యాధికారి సయ్యద్‌ అక్బర్‌ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండంటున్నారు స్థానికులు. భారీ విద్యుత్‌ లైన్లు పక్కనుంచే వెళ్తున్నాయి వాటి రేడియేషన్‌ విద్యార్థులపై ప్రభావం చూపదా విద్యార్థులపై అట్టి రేడియేషన్‌ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసే చర్యలు క్షమించరానివి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అనాగరిక చర్యలను నిశితంగా గమనించి శ్రీ చైతన్య పాఠశాల లో చదివే విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది .ఒకవైపు విద్యుత్‌ వైర్లు ఒకవైపు నిర్మాణం జరుగుతున్న పాఠశాల మరొకవైపు అడ్మిషన్ల ప్రక్రియ ఏకబిగిన కొనసాగించారు .పాఠశాల ప్రారంభించడం పుస్తకాలు డ్రస్సులు అక్కడే అమ్మడం యదేచ్చగా జరుగుతున్నప్పటికీ మండల విద్యాధికారి అటువైపు చూసిన పాపాన లేదు అంత ఖచ్చితంగా ఎందుకు చూడడం లేదు ఆ పాఠశాలలో చదివే విద్యార్థులకు అధికారిగా ఆయనదే గల బాధ్యత ఆయన బాధ్యత నిర్వహణలోపబోయిష్టంగా ఉంటే ఆయన పై అధికారులు ఏం చేస్తున్నట్లు కొన్ని పత్రికలలో కథనాలు ప్రచురించినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఎంతవరకు సమం జసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ కాసులకు కక్కుర్తి పడే అధికారులు ఉన్నన్నాళ్ళు వ్యవస్థ ఇలాగే బ్రష్టు పట్టిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా విద్యార్థుల భవిష్య త్తుతో చెలగాటమాడే వారు ఎంతటి వారైనా శిక్షార్హులు విద్యార్థుల భవిష్యత్తును అంగడి సరుకుగా మార్చకుండా ప్రభుత్వ ఉద్దేశాలు పక డ్బందీగా అమలు జరిగేటట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి చర్యలు చేపట్టాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు