Sunday, September 15, 2024
spot_img

ఆదిపురుష్ టీం క్షమాపణలు చెప్పాలి : శివసేన ఎంపీ..

తప్పక చదవండి

ఆదిపురుష్ చిత్రంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించారని ఎంపీ ఆరోపించారు. ఇందుకు గానూ దేశ ప్రజలకు చిత్రబృందం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

‘ఆదిపురుష్ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించారు. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్ విషయంలో డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వినోదం పేరుతో మనం పూజించే దేవుళ్లకు భాషను ఆపాదించడం ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మర్యాద పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి.. బాక్సాఫీస్ వద్ద విజయం కోసం మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటడం ఆమోదయోగ్యం కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించింది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. ఓంరౌత్ దర్శకుడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు