Saturday, November 2, 2024
spot_img

డబ్బింగ్ కార్యక్రమాల్లో మెగాస్టార్ బోళాశంకర్..

తప్పక చదవండి

కెరీర్‌ బిగెనింగ్‌లో బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో సందడి చేసిన కీర్తి సురేష్‌ ఆ మధ్య బాగా డల్‌ అయింది. ఒకానోక దశలో కీర్తి కెరీర్‌కు ఫుల్ స్టాప్‌ పడినట్లే అని అనిపించింది. అప్పుడే సాని కాదియమ్‌, సర్కారు వారి పాట వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది దసరాతో తన రేంజ్‌ ఏంటో మరోసారి నిరూపించింది. వెన్నెల పాత్రలో జీవించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో భోళా శంకర్‌ ఒకటి. మెగాస్టార్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. క ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాట సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాలో కీర్తి, చిరుకు చెల్లెలుగా కనిపించనుంది. కాగా తాజాగా భోళా శంకర్‌కు సంబంధించిన డబ్బింగ్‌ పనులు షూరూ చేసినట్లు ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఈ మేరకు మెహర్‌ రమేష్‌తో ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. మెహర్‌ రమేష్‌ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో మెగా ఫోన్‌ పట్టాడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌, క్రియేటీవ్‌ కమర్శియల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు