- దేశ రాజధాని ఢిల్లీ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
- ఓ యువకుడు విద్యార్థినిపై ఇనుపరాడ్డు తో దాడి చేసి దారుణంగా హతమార్చాడు.
- ఈ ఘటన నగరంలోని అరబిందో కళాశాల సమీపంలోని విజయ్ మండల్ పార్క్ లో శుక్రవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని నగరంలోని కమలా నెహ్రూ కాలేజీలో చదువుతోంది. తన 25 ఏళ్ల స్నేహితుడితో కలిసి అరబిందో కళాశాల సమీపంలోని పార్కుకు వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థినిపై ఆమె స్నేహితుడు రాడ్డుతో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ‘దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్ లోని అరబిందో కళాశాల సమీపంలోని పార్కులో యువతి మృతదేహం లభ్యమైందని మాకు సమాచారం అందింది. సదరు విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి పార్కుకు వచ్చింది. ఆమె తలపై గాయాలు ఉన్నాయి. డెడ్ బాడీ సమీపంలో ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నాం. నిందితుడి కోసం గాలిస్తున్నాం’ అని దక్షిణ ఢిల్లీ డీసీపీ చందన్ చౌదరి తెలిపారు.
తప్పక చదవండి
-Advertisement-