తక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే.. ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్‌పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీలకు ఉన్న డిమాండ్‌ను నిశితంగా
తక్కువ ధరకే టెస్లా నుంచి లగ్జరీ కారు.. రేటు ఎంతంటే..
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా..భారత మార్కెట్‌పై కన్నెసింది. ఇక్కడ అధికంగా పన్నులు ఉండటంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసిన సంస్థ..ఇక్కడి మార్కెట్లో ఈవీలకు ఉన్న డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నది. త్వరలో తక్కువ ధర కలిగిన మాడల్ 3ని ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నది.
ఈ కారు ధర రూ.20 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. ఇక్కడే అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మాడల్ 3 కంటే ఇది 25 శాతం తక్కువ ధర కావడం విశేషం. ప్రస్తుతం చైనాలో విక్రయిస్తున్న 32,200 డాలర్లు(రూ.26 లక్షలకు పైగా) మాడల్ కంటే ఇదే తక్కువ ధరది కావడం విశేషం.
తప్పక చదవండి
-Advertisement-