Sunday, September 8, 2024
spot_img

అనుమానం అనే రోగంతో భార్యను చంపిన భర్త…

తప్పక చదవండి

అనుమానంతో భార్యను హత్య చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆదివారం ఖమ్మం నగరంలోని జయనగర్‌కాలనీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలం గణేశ్వరానికి చెందిన భూక్యా సీతారాములు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 22 ఏళ్ల క్రితం రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన భూక్యా పార్వతి (38)తో వివాహమైంది.
రఘునాథపాలెం : అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆదివారం ఖమ్మం నగరంలోని జయనగర్‌కాలనీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలం గణేశ్వరానికి చెందిన భూక్యా సీతారాములు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 22 ఏళ్ల క్రితం రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన భూక్యా పార్వతి (38)తో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. సీతారాములు కొన్నేళ్ల నుంచి భార్యను అనుమానిస్తున్నాడు. ఇదే విషయంపై ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. భర్త వేధింపులకు తట్టుకోలేని భార్య అనేక మార్లు పోలీసులను ఆశ్రయించింది. అనేకసార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టింది.
సీతారాములు ఎప్పటికప్పుడు భార్యను బాగా చూసుకుంటానని చెప్పి మళ్లీ ఆమెను వేధిస్తుండేవాడు. మూడు నెలల క్రితం భార్యపై దాడి చేయగా ఆమె పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. సీతారాములు ఇటీవల పెద్ద మనుషులతో చెప్పించి భార్యాపిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. మూడురోజుల నుంచి మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ కమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త కోపోద్రిక్తుడై భార్యను హతమార్చాడు.
అనంతరం ఏపీలోని వైజాగ్‌లో ఉంటున్న కుమారుడికి కాల్‌ చేసి ‘మీ అమ్మ నాతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది..’ అని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. కుమారుడు తిరిగి తల్లికి కాల్‌ చేసినా ఎత్తకపోవడంతో రఘునాథపాలెంలో ఉంటున్న అమ్మమ్మకు కాల్‌ చేశాడు. ఆదివారం ఉదయం పార్వతి సోదరుడు ఇంటికి వచ్చి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల వెనుక భాగంలో బలమైన గాయాన్ని గుర్తించారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు